CM Jagan: ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని జగన్.. ఇంతకంటే ఘోరం ఉందా?

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో భాగంగా పాదయాత్ర చేస్తూ ఎన్నో హామీలను ఇచ్చారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు భారీ స్థాయిలో ఎన్నికల హామీలను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అదేమీ అంటే మేము ఆ హామీలను మేనిఫెస్టోలో పెట్టలేదని చెబుతున్నారు. పోనీ మేనిఫెస్టోలో పెట్టినది అయినా సవ్యంగా చేశారా అంటే అది కూడా ఆరకొరకగానే చేసి ఇప్పుడు మరి మీ బిడ్డను గెలిపించండి అంటూ ఓట్లు అడగడానికి ప్రజల ముందుకు వస్తున్నారు.

గత ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీల కోసం ఎన్నో హామీలను ఇచ్చారు. అందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పిన ఈయన ఆ మాటే మర్చిపోయారని చెప్పాలి. వారికి చెందాల్సిన నిధులను పథకాలకు మళ్లించారు. పథకాల పేరుతో పంచి.. అవే సబ్ ప్లాన్ నిధులుగా మార్చారు. ఇంకా అనేక పనులకు కూడా మళ్లించి అవి ఎస్సీల కోసమే చేశామని గొప్పలు చెబుతున్నారు.

ఎస్సీ, ఎస్టీలకు భూపంపిణీతో పాటు ఉచితంగా బోరు వేయించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో ఒక్కరంటే ఒక్క రైతుకు భూమిని పంచలేదు. భూమిని పంచలేదు కాబట్టి బోరు వేయించే అవకాశం లేదు. ఇక ఎస్సీ ఎస్టీ అక్కచెల్లెమ్మలకు పెళ్లి అయితే కనుక లక్ష రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లి ఆ నిధులు వేయకుండా ఆపివేశారు ఇక తీరా ఎన్నికల సమయంలో ఏదో ఇస్తున్నట్టు షో చేశారు.

గత ప్రభుత్వంలో ఎలాంటి హామీలు షరతులు లేకుండా పెళ్లి కానుక వారి అకౌంట్లో పడేది.ఎస్సీ, ఎస్టీ కాలనీలు , గిరిజన తండాలలో ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అని చెప్పిన జగన్ పదుల సంఖ్యలో కరెంటు బిల్లులను పెంచుతూ అందరికీ షాక్ ఇచ్చారు.500కు మించి జనాభా ఉన్న ప్రతి గూడెం, తండాను పంచాయతీగా మారుస్తామని చెప్పిన జగన్ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆ విషయం గురించి ఆలోచించడమే మానేశారు. ఇలా నా ఎస్టీలు ఎస్టీలు అంటూ వారి కోసం ఎన్నో హామీలను ఇచ్చిన ఈయన వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -