Supreme Court: అక్రమాస్తుల కేసులో జగన్ కు భారీ షాక్ తగలుతోందా.. ఏమైందంటే?

Supreme Court: ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు నత్తనడకన సాగుతోందనే సంగతి తెలిసిందే. ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్ బెయిల్ రద్దుతో పాటు అక్రమాస్తులు, ఇతర కేసులకు సంబంధించిన విచారణను వేగవంతం చేయాలని కోర్టును ఆశ్రయించగా తాజాగా ఆ పిటిషన్ల గురించి విచారణ జరిగింది. సుప్రీం కోర్టు జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నించడం గమనార్హం.

 

కేసుల విచారణకు ఎవరు బాధ్యత వహిస్తారని ధర్మాసనం సీబీఐ అధికారులను ప్రశ్నించడం హాట్ టాపిక్ అవుతోంది. సమయం ఇచ్చినా ఎలాంటి ఫలితం లేదని సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేయడంతో పాటు ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ ను అయినా పరిష్కరించారా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఏప్రిల్ నెలలో తదుపరి విచారణ చేపట్టనున్నట్టు సుప్రీం కోర్టు పేర్కొంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ కేసు గురించి ప్రస్తావిస్తూ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.

సుప్రీం కోర్టులో జగన్ సర్కార్ కు షాకిచ్చేలా వరుస తీర్పులు వస్తుండటం గమనార్హం. మరోవైపు రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంలో జగన్ సర్కార్ కు షాక్ తగిలింది. కోస్టల్ నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం లే అవుట్ వేస్తూ ఇతర కార్యకలాపాల కోసం వినియోగించే దిశగా అడుగులు వేయడంపై విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

 

ఈ కేసు గురించి ఏపీ ప్రభుత్వం మార్చి 11వ తేదీలోగా స్పందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం, ప్రతివాదులకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. ఏపీ ప్రభుత్వానికి వరుస షాకులు తగులుతుండగా రాబోయే రోజుల్లో జగన్ మళ్లీ అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కోర్టులలో జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా తీర్పులు రావడం ఇదే తొలిసారి కాదు.

 

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ రాబోయే రోజుల్లో వేగం పుంజుకునే అవకాశం అయితే ఉంది. మరోవైపు వైఎస్ షర్మిల రూపంలో సీఎం జగన్ కు కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నెల 21వ తేదీన వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ బాధ్యతలను స్వీకరించనున్నారని తెలుస్తోంది. షర్మిల కడపలోని ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది.

 

సుప్రీం కోర్టులో అక్రమాస్తుల కేసు విచారణలో వేగం పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో జగన్ అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. పలుకుబడి ఉన్న వ్యక్తుల కేసులను వేగంగా విచారించాలని సుప్రీం కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో వైసీపీకి షాక్ తప్పదని 2014 ఫలితాలే ఏపీలో రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ మాత్రం ఈ ఎన్నికల్లో కూడా వైసీపీకే అనుకూల ఫలితాలు వస్తాయని నమ్ముతోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -