Notes Demonetization: ఆ నోట్లు మాత్రమే చెల్లుబాటు కానున్నాయా.. మళ్లీ నోట్లరద్దు జరగనుందా?

Notes Demonetization: ఇప్పటికే గతంలో 500 రూపాయలు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. వాటిని రద్దు చేస్తున్న ప్రభుత్వం 2000 నోట్లోనూ ప్రవేశపెట్టింది. కానీ ఇటీవల మరోసారి రెండు వేల రూపాయల నోట్లను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా 500 నోట్లు కూడా రద్దు కాబోతున్నాయి అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవల జరిగిన రెండు వేల రూపాయల నోటు రద్దు పై దాదాపు రెండేళ్ల నుంచి వార్తలు ముమ్మరంగా వినిపిస్తూనే వచ్చాయి. మొత్తానికి ఆ వార్తలను నిజం చేస్తూ 2000 నోట్లను రద్దు చేశారు.

2000 నోటు రద్దు తర్వాత మ‌ళ్లీ వెయ్యి నోటు రాబోతోంద‌నే ప్ర‌చారం ఒక‌టి జోరుగా సాగుతోంది. డీమానిటైజేష‌న్ కు ముందు వెయ్యి రూపాయ‌ల నోటు మార‌కంలో ఉండేద‌నే సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పెళ‌పెళ‌మ‌నే వెయ్యి నోట్ల‌ను లెక్క‌బెట్ట‌డం అయినా, వైట్ ష‌ర్ట్ లో ప్యాకెట్ లో ఆ రంగుల నోటు మెర‌వ‌డం అన్నా అదో గ్లామ‌ర్! దాన్ని ర‌ద్దు చేశారు న‌రేంద్ర‌మోడీ. ఇటీవ‌ల రెండు వేల రూపాయ‌ల నోటు ర‌ద్దు చేయ‌డంతో ఐదు వంద‌ల రూపాయ‌ల నోటు మాత్ర‌మే మార‌కంలో అతి పెద్ద‌దిగా మిగిలింది. వెయ్యి నోటు తిరిగి రానుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. కానీ కేంద్రం మాత్రం అలాంటిదేమీ లేద‌ని అంటోంది. పార్ల‌మెంట్ లోనే ఈ ప్ర‌క‌ట‌న చేసింది. వెయ్యి రూపాయ‌ల నోటును తిరిగి తీసుకు వ‌చ్చే ఉద్దేశం ప్ర‌స్తుతానికి లేద‌ని కేంద్రం ప్ర‌క‌టించింది.

 

అలాగే ఐదు వంద‌ల రూపాయ‌ల నోటును ర‌ద్దు చేసే ఉద్దేశం కూడా లేద‌ని తెలిపింది. మ‌రి క‌రెన్సీ నోట్ల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంట్ లో ఏం చెప్పినా.. రూమ‌ర్ల‌కు అయితే ఆస్కారం ఉండనే ఉంది. ఇదివరకు 500,1000, 2000 నోట్ల విషయంలో సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు నిజం కావడంతో త్వరలోనే 500 రూపాయలు నోట్లు కూడా రద్దు అవుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -