Pawan Kalyan: 2024 ఎన్నికల్లో పవన్ సీఎం అవుతారట.. ఏమైందంటే?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన వ్యక్తి. హీరోగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. రాజకీయాల్లోనూ తనదైన శైలిలో ముద్ర వేసుకుంటున్నారు. 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ‘సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, జానీ, జల్సా, గబ్బర్ సింగ్’ వంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలొయింగ్, క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంలో ‘జనసేన’ పార్టీని స్థాపించాడు. అలా ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ప్రతిపక్షంగా ఎదుగుతోంది. గత ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన పవన్ కళ్యాణ్ ఈ సారి కచ్ఛితంగా అధికారంలోకి వచ్చేందుకు కష్టపడుతున్నాడు. అటు సినిమాలు మ్యానేజ్ చేస్తూ.. ఇటు రాజకీయాల్లోనూ వేగం పెంచాడు.

 

 

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో ప్రధాన పార్టీలైన వైఎస్సార్ సీపీ, టీడీపీ, జనసేన వేగం పెంచాయి. ఇప్పటికీ ఇరు పార్టీల నాయకులు ప్రజల్లోకి వెళ్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. జగన్ సర్కాన్‌ను కూలగొట్టేందుకు వ్యూహాన్ని రచిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన-టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. రెండు పార్టీలు ఏకమై ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో ఊహించని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ జ్యోతిష్యులు ఇటీవల పవన్ కళ్యాణ్ జాతకం చూశారు. పవన్ కళ్యాణ్ జాతకంలో 2024లో కచ్చితంగా సీఎం అయ్యే యోగ్యత ఉందని చెబుతున్నారు. అయితే సీఎం అవ్వాలంటే అంత ఈజీ కాదని, ఎంతో శ్రమించాలని పేర్కొంటున్నారు. కష్టాన్ని నమ్ముకుంటే కచ్చితంగా ఏపీకి పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష్యులు చెప్పిన మాట విని పవన్ అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరోను సీఎంగా చూసే రోజులు దగ్గర పడ్డాయని సంబర పడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -