Pawan Kalyan: ఓటమి భయంతోనే జగన్ కు కోపం.. వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ అధినేతలు ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు ఈ క్రమంలోనే కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇటీవల కృష్ణాజిల్లా పెడనలో నిర్వహించిన టీడీపీ ప్రజాగళం సభలో పాల్గొంటూ ఈ ఐదు సంవత్సరాల జగన్ పరిపాలనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో విపక్షాలను ఉద్దేశించి జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఐదేళ్లలో అన్ని వర్గాలను వంచించిన జగన్ కు మరోసారి ఓటేయొద్దని ప్రజల్ని కోరారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..తాను భీమవరం నుంచి ఎందుకు వెళ్లిపోయానని జగన్ బాధపడుతున్నారని ఎద్దేవ చేశారు. 70 మంది ఎమ్మెల్యేలను ఎందుకు మార్చారని ప్రశ్నించారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని తెలిపారు. ఇక జగన్మోహన్ రెడ్డి జాతీయ ఉపాధి హామీ పథకాల నిధులు ఎక్కడికి పంపించారని ప్రశ్నించారు అదేవిధంగా మత్స్యకారుల పొట్ట కొట్టారని భవన కార్మికుల నిధులను ఎక్కడకు మళ్ళించారని ఈయన ప్రశ్నించారు.

ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి తన పట్ల చాలా కోపం ప్రదర్శిస్తున్నారని తెలిపారు. అయితే ఆ కోపం మొత్తం ఎక్కడ ఎన్నికలలో ఓడిపోతామో నన్న భయం కారణంగానే కోప్పడుతున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు మీరు మా పట్ల ఎన్ని తిట్లు తిట్టిన మేం బలపడతామే తప్ప బలహీనపడమని పవన్ వెల్లడించారు. తాము కూటమిగా ఏర్పడింది కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమేనని తెలిపారు.

జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తే ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని నాశనం చేశారని తెలిపారు. అందుకే ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఎంతో అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంతో అవసరం అంటూ పవన్ కళ్యాణ్ అందరికీ పిలుపునిచ్చారు.రాష్ట్రాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామని తమ పార్టీ అభ్యర్థులతో ప్రమాణం చేయించానని పవన్ తెలిపారు. కాబట్టి గెలిపించడం కాదు, భారీ మెజారిటీ కావాలన్నారు.

ఇలా జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేసినటువంటి పవన్ స్థానిక ఎమ్మెల్యే జోగి రమేష్ పట్ల కూడా విమర్శలు చేశారు. తన పేరు పలకడానికి కూడా అర్హత లేదని తెలిపారు. అంతేకాకుండా జోగి రమేష్ స్థానికంగా ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని ఒక చిన్న పని ప్రారంభించాలన్న జోగి రమేష్ కు పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అంటూ పవన్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -