Ali-Pawan: అలీ విషయంలో పగ తీర్చుకున్న పవన్ కళ్యాణ్.. ఆ పని చేయడంతో?

Ali-Pawan: టాలీవుడ్ టాప్ కమెడియన్ అలీ, పవన్ కళ్యాణ్ మధ్య స్నేహబంధం గురించి మనందరికీ తెలిసిందే. పలు సినిమాలలో వీరిద్రూ కలిసి నటించారు. అయితే మొన్నటి వరకు కూడా వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పవచ్చు. అలీ వైసీపీ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరిని దూరం చేసుకుంటున్నాడు. వైసీపీ హైకమాండ్ ను మెప్పించడానికి పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి.. అటూ ఇటూ కాకుండా అయిపోయారు. అలీతో ఎలాంటి పరిచయాల్ని కొనసాగించడానికి పవన్ సిద్ధంగా లేరని గత పరిచయాలు స్నేహాలు ఏమైనా ఉంటే మార్చిపోవాలని డిసైడయ్యారని తాజాగా ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఫస్ట్ పోస్టు ద్వారా పవన్ తేల్చేసినట్లయిది.

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగు పెట్టిన పవన్ తన మొదటి పోస్టులో సినిమా ఇండస్ట్రీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు! చలన చిత్ర పరిశ్రమలో భాగమై ఎంతో మంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞుణ్ణి అని ఆయన పేర్కొన్నారు. చివర్లో మన బంధం ఇలానే కొనసాగాలని, మరెన్నో మధురమైన జ్ఞాపకాల్ని పంచుకోవాలని ఆశిస్తూ అంటూ ముగించారు. తన పోస్టులో హీరోలు, దర్శకులు, హీరోయిన్లు, ఇతర సాంకేతిక నిపుణులతో దిగిన ఫోటోలను పవన్ కళ్యాణ్ షేర్ చేశారు. ఎక్కడా కూడా అలీ ఫోటో లేదు. హైపర్ ఆది ఉన్నారు. హాస్య నటుడు శ్రీనివాస రెడ్డి కూడా ఉన్నారు.

 

కానీ అలీని మాత్రం దూరం పెట్టారు. ఇంకా విశేషం ఏమిటంటే.. పేటీఎం ఆర్టిస్టు మౌనికా రెడ్డిగా సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుని సినిమాల్లోకి వచ్చిన యువతి కూడా పవన్ పోస్టుల్లో ఉన్నారు. ఆమె గతంలో పవన్ ను విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కానీ అలీకి చోటు లేదు. గత ఎన్నికల సందర్భంగా అలీ. వైసీపీలో చేరారు. ఆయన వైసీపీలో చేరినా పవన్ పట్టించుకోలేదు కానీ నేరుగా పవన్ పైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి శృతి మించిపోయాయి. అందుకే పవన్ రిలేషన్ కట్ చేసుకున్నారని మరోసారి గుర్తు చేసుకోవడానికి కూడా రెడీగా లేరంటున్నారు. దీంతో అలీకి పవన్ కళ్యాణ్ కి మధ్య దూరం పెరిగిపోయింది.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -