PowerBill: ఆన్‌లైన్‌లో కరెంట్ బిల్లు కట్టేవాళ్లకు భారీ షాక్.. ఏమైందంటే?

PowerBill: రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలను అవలంభిస్తూ మోసాలకు తెరలేపుతున్నారు. ప్రస్తుత కాలంలో చాలామాటికి ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేస్తున్నారు. ఈ ఆన్‌లైన్‌ బిల్లులు చెల్లింపులో జాగ్రత్తలు పాటించకుంటే బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఇటీవల ఎలక్ట్రిసిటీ బిల్ ఆన్‌లైన్‌లో చేసేవారు చాలా మంది సైబర్‌ బారిన పడుతున్నారు. ఎలక్ట్రికల్ కంపెనీలు, సప్లయర్స్‌ కరెంట్ బిల్లుకు సంబంధించి వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్ మెసే‌జ్‌లు పంపుతుంటారు. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నారు.

 

అచ్చం ఆ కంపెనీల మాదిరే కరెంట్ బిల్లు కట్టాలని సందేశాలు పంపి మోసాలకు పాల్పడుతున్నారు. ఆ మెసే‌జెస్‌ల్లో మీరు కరెంట్ బిల్లు కట్టాల్సి ఉందని.. బిల్లు కట్టేందుకు ఒక నంబర్ ఇచ్చి దానికి కాల్ లేదా మెసేజ్ చేయాలని, లేదంటే కరెంట్ కనెక్షన్ కట్ అవుతుందని హెచ్చరిస్తున్నారు. వాళ్ల ఉచ్చులో పడి మీరు గనుక ఆ పని చేస్తే మీ ఆర్థిక సమాచారం (ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్) వారికి చేరుతుంది. ఇక వారి పని మొదలు పెట్టి మీ ఖాతాలను ఖాళీ చేసే పనిలో పడుతారు.

 

గుర్తించుకోవాల్సినవి..

మీకు ఇలాంటి సందేశాలు వస్తే.. వెరిఫైడ్ ఐడీ, మొబైల్ నంబరు సరైందో లేదో చూసుకోవాలి. ఒకవేళ అది ఏదైనా నంబర్ నుంచి వస్తే గనుక అది ఫేక్ అని అర్థం చేసుకోవాలి. అందులో ఉన్న నంబరుకు ఫోన్ గానీ, మెసేజ్ గానీ చేయొద్దు. వారితో మీ పర్సనల్ లేదా బ్యాంకింగ్ వివరాలు అస్సలు ఇవ్వొద్దు. పొరపాటున వారు పంపిన లింక్‌ గానీ.. మెసేజ్‌కు స్పందిస్తే క్షణాల్లో మీ అకౌంట్‌ నుంచి డబ్బులు డ్రా అవుతాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు, ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఇలాంటి మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని కస్టమర్లకు సూచిస్తోంది. ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయని చాలా మంది ట్విట్టర్‌లో కంప్లైంట్స్ కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జాగ్రత్తగా ఉండాలని ఎస్‌బీఐ హెచ్చరిస్తోంది. అలాంటి మెసేజ్‌లు, కాల్స్‌కు రిప్లై ఇవ్వొద్దని స్పష్టం చేసింది.రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలను అవలంభిస్తూ మోసాలకు తెరలేపుతున్నారు. ప్రస్తుత కాలంలో చాలామాటికి ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేస్తున్నారు. ఈ ఆన్‌లైన్‌ బిల్లులు చెల్లింపులో జాగ్రత్తలు పాటించకుంటే బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఇటీవల ఎలక్ట్రిసిటీ బిల్ ఆన్‌లైన్‌లో చేసేవారు చాలా మంది సైబర్‌ బారిన పడుతున్నారు. ఎలక్ట్రికల్ కంపెనీలు, సప్లయర్స్‌ కరెంట్ బిల్లుకు సంబంధించి వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్ మెసే‌జ్‌లు పంపుతుంటారు. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నారు.

 

అచ్చం ఆ కంపెనీల మాదిరే కరెంట్ బిల్లు కట్టాలని సందేశాలు పంపి మోసాలకు పాల్పడుతున్నారు. ఆ మెసే‌జెస్‌ల్లో మీరు కరెంట్ బిల్లు కట్టాల్సి ఉందని.. బిల్లు కట్టేందుకు ఒక నంబర్ ఇచ్చి దానికి కాల్ లేదా మెసేజ్ చేయాలని, లేదంటే కరెంట్ కనెక్షన్ కట్ అవుతుందని హెచ్చరిస్తున్నారు. వాళ్ల ఉచ్చులో పడి మీరు గనుక ఆ పని చేస్తే మీ ఆర్థిక సమాచారం (ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్) వారికి చేరుతుంది. ఇక వారి పని మొదలు పెట్టి మీ ఖాతాలను ఖాళీ చేసే పనిలో పడుతారు.

 

గుర్తించుకోవాల్సినవి..

మీకు ఇలాంటి సందేశాలు వస్తే.. వెరిఫైడ్ ఐడీ, మొబైల్ నంబరు సరైందో లేదో చూసుకోవాలి. ఒకవేళ అది ఏదైనా నంబర్ నుంచి వస్తే గనుక అది ఫేక్ అని అర్థం చేసుకోవాలి. అందులో ఉన్న నంబరుకు ఫోన్ గానీ, మెసేజ్ గానీ చేయొద్దు. వారితో మీ పర్సనల్ లేదా బ్యాంకింగ్ వివరాలు అస్సలు ఇవ్వొద్దు. పొరపాటున వారు పంపిన లింక్‌ గానీ.. మెసేజ్‌కు స్పందిస్తే క్షణాల్లో మీ అకౌంట్‌ నుంచి డబ్బులు డ్రా అవుతాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు, ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఇలాంటి మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని కస్టమర్లకు సూచిస్తోంది. ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయని చాలా మంది ట్విట్టర్‌లో కంప్లైంట్స్ కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జాగ్రత్తగా ఉండాలని ఎస్‌బీఐ హెచ్చరిస్తోంది. అలాంటి మెసేజ్‌లు, కాల్స్‌కు రిప్లై ఇవ్వొద్దని స్పష్టం చేసింది.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts