Current Bill: కరెంట్ బిల్లును సులువుగా తగ్గించుకోవాలంటే బెస్ట్ ఆప్షన్ ఇదే!

Current Bill: మార్చిలో ఎండల మంటలు హడలెత్తిస్తున్నాయి. వేడిని తట్టుకోవటానికి ఏసీలు, ఫ్యాన్లు తప్పనిసరి. ఇక కరెంట్ కోతలతోపాటు, విద్యుత్ వాడకం కూడా గణనీయంగా పెరుగుతోంది. కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని చాలామంది బాధపడుతున్నారు. అలాంటివారు ఈ ఐదు పద్ధతులతో కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చు.


మనం ఏసీ ని ఆఫ్ చేసినప్పుడు పవర్ బటన్ ఆఫ్ లో ఉందా లేదా ఆన్ లో ఉందా అనేది కంపల్సరీ చూసుకోవాలి. చాలామంది రిమోట్ తోనే ఏసీ ని ఆఫ్ చేసి పవర్ బటన్ ను మాత్రం అలా వదిలేస్తారు. దీనివల్ల అదనపు కరెంటు ఖర్చు అవుతుంది. బిల్లు పెరిగిపోతుంది. కాబట్టి పవర్ బటన్ ఆఫ్ చేయాలి. ఏసీని ఎప్పుడైనా నిర్దిష్ట టెంపరేచర్ వద్ద సెట్ చేయడం మంచిది. తక్కువ టెంపరేచర్ వద్ద ఏసీని రన్ చేయకూడదు. 15 నుంచి 16 డిగ్రీల వద్ద సెట్ చేస్తే కరెంట్ బిల్లు వాచిపోతుంది. కాబట్టి ఏసీ 24 డిగ్రీల వద్ద సెట్ చేయాలి. దీనివల్ల బిల్ ఎక్కువ రాదు.

ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా సరే ఉపయోగించగానే సరిపోదు. వాటిని సర్వీసింగ్ కూడా చేయడం చాలా ముఖ్యం. ఎప్పుడు పర్ఫెక్ట్ కండిషన్ లో ఉన్న గాడ్జెట్ లు ఎక్కువగా పని చేస్తాయి. కరెంటు కూడా ఆదా చేస్తాయి. ఏసీ ఆన్ చేసినప్పుడు కిటికీలు తలుపులు మూసివేయాలి. లేదంటే బయట గాలి లోపలికి వచ్చిన లోపలి గాలి బయటకు వెళ్లినా ఏసీ ఆన్ చేసి వేస్ట్. కరెంట్ ఖర్చు కూడా పెరిగిపోతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -