Mla Daughter Love Marriage: కుమార్తెకు ప్రేమ వివాహం జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే.. ఆ విషయంలో నిజంగా గ్రేట్ అంటూ?

Mla Daughter Love Marriage:  కులమతాలని, స్థాయిని చూడకుండా కేవలం కూతురు ఇష్టపడిందని ప్రేమ వివాహం జరిపించి తండ్రిగా ఒక మెట్టు పైకి ఎక్కాడు ఈ రాజకీయ నాయకుడు. సాధారణంగా ప్రేమ అనేసరికి పెద్దవాళ్లలో ఎక్కడలేని ఆవేశం బయటికి వస్తుంది. అవతలి వ్యక్తిలో కావలసిన సద్గుణాలు అన్నీ ఉన్నప్పటికీ ఎందుకో ప్రేమ వివాహం అనేసరికి పెద్దగా సుముఖత చూపించరు పెద్దవాళ్లు. అందులో డబ్బున్న ఆడపిల్ల తల్లిదండ్రులు అయితే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.

అయితే వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాత్రం తన పెద్ద కుమార్తె పల్లవి ప్రేమించిందని పవన్ అనే యువకుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. వీళ్ళిద్దరూ చదువుకునే రోజుల్లో క్లాస్మేట్స్. కాలేజీ రోజుల్లోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. తమ ప్రేమ విషయాన్ని పెద్దలు దృష్టికి తీసుకువెళ్లారు. పల్లవి తను ప్రేమ విషయాన్ని తండ్రికి చెప్పినప్పుడు ఆ తండ్రి పెద్ద మనసుతో అర్థం చేసుకున్నాడు.

ఆస్తులు, అంతస్తులు, కులం ఇలాంటి విషయాల కి ఏమాత్రం ప్రాధాన్యతని ఇవ్వకుండా ఆ యువకుడుతో పెళ్లి జరిపిస్తానని కూతురికి మాట ఇచ్చాడు ఈ ఉత్తమ తండ్రి. మాట ఇచ్చినట్లుగానే బొల్లవరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పల్లవి, పవన్ పెళ్లి పెద్దల సమక్షంలో జరిపించాడు. ఆ తరువాత ప్రొద్దుటూరులోని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ మళ్ళీ వాళ్ళ మ్యారేజ్ ని రిజిస్ట్రేషన్ చేయించాడు.

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన కుమార్తెకు ప్రేమ వివాహం చేయడంపై సర్వర్త్రా ప్రశంసలు అందుకున్నారు. ఆదర్శ తండ్రిగా నిలిచారని జనం అంటున్నారు. ఆయనలాగే అందరు తల్లిదండ్రులు ఆలోచిస్తే అన్ని ప్రేమకథలు ఇలాగే సుఖాంతం అవుతాయి అంటున్నారు. అయితే వీటిని పెద్దగా పట్టించుకోని ఆ కన్నతండ్రి.. నేను నా కుమార్తె ఇష్ట ప్రకారం ఈ వివాహం జరిపించాను. ఎంతో ఆనందంగా ఆ జంటను ఆశీర్వదించాను. చదువుకున్న రోజుల్లోనే వాళ్ళు ఇష్టపడ్డారు అందుకే ఈ పెళ్లి చేశాను అని చెప్పుకొచ్చారు శివప్రసాద్ రెడ్డి. ఏదేమైనప్పటికీ ఈ విషయంలో ఆయన చాలా గ్రేట్ కదా.

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -