Pruthvi Raj: బ్రో విమర్శలపై ఘాటుగా స్పందించిన పృథ్వీరాజ్.. ఏం చెప్పారంటే?

Pruthvi Raj: బ్రో సినిమా రిలీజ్ అయ్యి అనుకున్న విజయాన్ని సాధించలేదని మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఇది కేవలం పవన్ ఫ్యాన్స్ కి మాత్రమే అంటూ బయట అప్పుడే సెటైర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇంతకన్నా మరొక విషయంలో బ్రో సినిమా బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ తో ఈ సీన్లో అంబటి రాంబాబుని ఇమిటేట్ చేయించిన సీన్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ ఏడాది తన నియోజకవర్గంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఏపీ మంత్రి అంబటి రాంబాబు హుషారుగా చిందులేసి అదరగొట్టారు. దీన్నే ప్యారడీగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ శ్యాంబాబు పాత్రలో బ్రో సినిమాలో ఇమిటేట్ చేయించారు. దీనిపై అంబటి రాంబాబు కూడా స్పందించారు. అక్కడ డాన్స్ సింక్ అవ్వడానికి నేనేమీ డాన్స్ మాస్టర్ ని కాదు. అయినా నేను చేసింది ఆనందతాండవం. పవన్ కళ్యాణ్ ది ఒక సునకానందం.

 

రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. నేనేమీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ప్యాకేజీ తీసుకొని డాన్సులు చేయలేదు. అయినా పవన్ రాజకీయాలకి సింక్ అవ్వడు అంటూ నేరుగా పవన్ నే టాగ్ చేశారు అంబటి రాంబాబు. దీనిపై 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కూడా స్పందించడం విశేషం. అంబటి రాంబాబుని అనుకరించడానికి ఆయన ఏమి ఆస్కార్ స్థాయి నటుడు కాదు.

 

ఆయనని అనుకరించాము అని ఆయన అనుకుంటున్నారేమో కానీ మేము అనుకోవటం లేదు. ఇందులో నాది బాధ్యత లేని ఒక పాత్ర. అందులో చేసిన డ్యాన్స్ తనకి సింక్ అయింది అనిపిస్తే దానికి మేము బాధ్యులం కాదు అంటూ రివర్స్ కౌంట్ ఇచ్చాడు పృద్వి. జనసేన వర్గాలు కూడా ఈ కామెంట్ ని తిప్పి కొడుతున్నాయి. ఒకరిని ఇమిటేట్ చేయవలసిన అవసరం పవన్ కి లేదంటూ పవన్ ని వెనకేసుకొస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -