Punjab National Bank: ఆ బ్యాంకు కస్టమర్లకు శుభవార్త.. వడ్డీ రేట్లు భారీగా పెంపు!

Punjab National Bank:తమ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే చాలామంది బ్యాంక్ లో వాటిని దాచుకుంటారు. బ్యాంకులో భద్రంగా ఉంటాయనే నమ్మకంతో డిపాజిట్ చేస్తారు. అయితే బ్యాంకులో దాచుకున్న సొమ్ముకు వడ్డీ కూడా వస్తుంది. సేవింగ్స్ అకౌంట్ లో డబ్బులు దాచుకుంటే ఏడాదికి బ్యాంకులను బట్టి 2 శాతం వరకు వడ్డీ వస్తుంది. అయితే ఫిక్స్ డ్, రికరింగ్ డిపాజిట్లు చేస్తే వడ్డీ మరింత ఎక్కువగా వస్తుంది. అందుకే చాలామంది ఫిక్స్ డ్ డిపాజిట్ బ్యాంకులో చేస్తూ ఉంటారు.

తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంకు వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఫిక్స్ డ్ డిపాజిట్లపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ వడ్డీ రేటు పెంచింది. ఇప్పటికే పెరిగిన వడ్డీ రేట్లను అమల్లోకి తెచ్చింది. కొత్తగా ఫిక్స్ డే డిపాజిట్ చేసుకునేవారికి లేదా అంతకుముందు చేసిన ఫిక్స్ డ్ డిపాజిట్లను రెన్యూవల్ చేసుకున్నవారికి కొత్త వడ్డీ రేట్లు అమలు అవుతాయి. రూ.2 కోట్లకు లోపు ఫిక్స్ డ్ డిపాజిట్లకు పెంచిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

ఏడాది నుంచి మూడేళ్ల కాల పరిమితిలోని ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. అలాగే ఐదేళ్ల టెన్యూర్ లోని ఫిక్స్ డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు పెంచింది. 7 రోజుల నుంచి 45 రోజుల ఫిక్స్ డ్ డిపాజిట్లపై 3 శాతం, 46 రోజుల నుంచి 90 రోజుల డిపాజిట్లపై 3.25 శాతం, 91 రోజుల నుంచి 179 రోజుల ఫిక్స్ డ్ డిపాజిట్లపై 4 శాతం, 180 రోజుల నుంచి ఏడాదిలోపు ఫిక్స్ డ్ డిపాజిట్లపై 4.5 శాతంగా వడ్డీ ఉంి.

ఇక ఇక ఏడాది ఫిక్స్ డ్ డిపాజిట్లపై 5.5 శాతం, ఏడాది నుంచి రెండేళ్ల ఎఫ్ డీలపై 5.5 శాతం, మూడేళ్లలోపు డిపాజిట్లపై 5.6 శాతంగా వడ్డీ రేట్లు ఉన్నాయి. ఇక ఐదేళ్ల లోపు ఫిక్స్ డే డిపాజిట్లపై 5.75 శాతం, పదేళ్లలోపు పాటిపై 5.65 శాతంగా ఉంది. ఇక 1111 రోజుల ఫిక్స్ డే డిపాజిట్లపై 5.75 శాతంగా వడ్డీ ఉంది. ఇక సీనియన్ సిటిజన్ల ఫిక్స్ డే డిపాజిట్లపై అదనంగా 50 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లు పెంచింది. ఆగస్టు 17 నుంచే పెంచిన వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పష్టం చేసింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఉప్మాకు అమ్ముడుపోవద్దంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు.. ఆ ఉప్మా ఎవరంటే?

Pawan Kalyan:  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ తన ప్రచారం లో జోరు, ప్రసంగాలలో హోరు పెంచుతున్నారు. తనదైన స్టైల్ లో ప్రతిపక్షం వారిని విమర్శిస్తూ కూటమి అధికారంలోకి వస్తే...
- Advertisement -
- Advertisement -