Rakshita: సన్నజాజితీగల నాజుగ్గా ఉన్న రవితేజ హీరోయిన్ ఎలా మారిపోయారో చూసారా?

Rakshita: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు తమ శరీరంపై ఎంతో శ్రద్ధ వహిస్తుంటారు. వయసు పైబడిన తమ అందం తరగకుండా ఉండడం కోసం ఫుడ్ విషయం నుంచి ప్రతి ఒక్క విషయంలోనూ ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ తమ శరీరాన్ని అందాన్ని కాపాడుకుంటూ వస్తారు. అయితే వయసు పై పడే కొద్ది ప్రతి ఒక్కరిలోనూ తప్పనిసరిగా శరీరాకృతిలో మార్పులు వస్తాయి.

ఈ విధంగా శరీరంలో మార్పులు వస్తున్న సమయంలో కొందరు తమ శరీరాకృతపై దృష్టి సారించి పూర్తిగా శరీర బరువు తగ్గడానికి ఇష్టపడతారు మరి కొంతమంది సహజ సిద్ధంగా పెరిగే శరీర బరువు వల్ల అలాగే కొన్ని హార్మోన్ల అసమతుల్యత వల్ల శరీర బరువు పెరుగుతుంటారు. ఇలా కొన్ని హార్మోన్ల ప్రాబ్లం వల్ల నటి రక్షిత గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటోలు చూసిన అభిమానులు అసలు హీరోయిన్ రక్షిత నేనా ఇక్కడ ఉన్నది అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఈమె కన్నడ నటి అయినప్పటికీ పునీత్ రాజ్ కుమార్ సరసన అప్పు అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి అయితే ఈ సినిమాకు తెలుగులో రీమేక్ చిత్రంగా తెరకెక్కిన ఇడియట్ సినిమాలో కూడా ఈమె నటించారు. ఇక తెలుగులో నిజం శివమణి వంటి పలు సినిమాలలో నటించే సందడి చేశారు.

ఇక ఈమె కన్నడలో అగ్ర హీరోయిన్ గా పేరు సంపాదించుకొని దూసుకుపోతున్న సమయంలో డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తనకు సంతానం కలిగిన తర్వాత థైరాయిడ్ సమస్యతో ఈమె అధికంగా శరీర బరువు అయ్యారు.ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు ఈమెను చూసి షాక్ అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -