Venu Madhav: కమెడియన్ వేణు మరణాన్ని గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన కుటుంబ సభ్యులు..!

Venu Madhav: తెలుగు ప్రేక్షకులకు మోస్ట్ వాంటెడ్ కమెడియన్ వేణుమాధవ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సాంప్రదాయం సినిమాతో వేణు కమెడియన్ గా అడుగుపెట్టి.. ప్రేక్షకులను తన కామెడీతో బాగా ఆకట్టుకున్నాడు. నిజానికి ఈ సినిమా వేణుమాధవ్ కి మంచి గుర్తింపు సంపాదించి పెట్టిందని చెప్పవచ్చు.

అనంతరం వేణు మాధవ్ 400 సినిమాలకు పైగా నటించి తెలుగు నాట కమెడియన్ గా తనకంటూ చరగని ముద్ర వేసుకున్నాడు. రవీంద్రభారతిలో వేణుమాధవ్ చేసిన ఒక స్కిట్.. అతని చరిత్రను తిరగరాసినట్లుగా చేసింది. అప్పటినుంచి వేణుమాధవ్ స్టార్ కమెడియన్ గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతూ వచ్చాడు. ఇక రాజకీయాల్లోకి వచ్చి.. వేణుకి ఎమ్మెల్యే కావాలని చాలా పట్టు ఉండేది. కానీ కొన్ని కారణాలవల్ల అది సాధించలేకపోయాడు.

ఇక కొంతకాలం క్రితం వేణు కొన్ని అనారోగ్య పరిస్థితులు కారణంగా కన్నుమూశాడు. ఈ విషయాన్ని సెలబ్రేటీల నుంచి సామాన్య ప్రజల వరకు ఎవరు తీసుకోలేకపోయారు. వేణు చేసిన కామెడీ ఇప్పటికీ టెలివిజన్ లో తెగ హడావిడి చేస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం వేణుమాధవ్ చనిపోవడానికి గల కారణాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఆయన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఆ ఇంటర్వ్యూలో కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. వేణుమాధవ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. డెంగ్యూ ఫీవర్ వల్ల వేణు చనిపోయాడని తెలిపారు. డెంగ్యూ ఫీవర్ వచ్చిన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వేణు చనిపోవడం జరిగిందని అతని భార్య పిల్లలు వెల్లడించారు.

నిజానికి వేణుమాధవ్ కి మద్యం సేవించే అలవాటు ఉందట.. కానీ ఆ మద్యం నాన్నగారు చావుకి ఎటువంటి కారణం కాదని వేణుమాధవ్ కొడుకులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ కు సంబంధించిన వీడియో యూట్యూబ్లో వైరల్ గా మారింది. ఆ ఇంటర్వ్యూ చూసిన నెటిజన్లు వేణుని మరోసారి గుర్తు తెచ్చుకొని.. బాధపడుతున్నారు. మరి మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -