Uttej : భార్య మరణాన్ని గుర్తు చేసుకున్న ఉత్తేజ్.. అందులో ఏం చెప్పారంటే?

Uttej: ప్రముఖ నటుడు ఉత్తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించి నటుడిగా గుర్తింపు పొందటమే కాకుండా ఎన్నో సినిమాలో కామెడియన్ గా నటించి తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇలా ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పాటుచేసిన ఉత్తేజ్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు.

ఇదిలా ఉండగా ఇటీవల సోషల్ మీడియాలో ఉత్తేజ్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. తన భార్య గురించి తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. పద్మ అనే యువతీని ఉత్తేజ్ ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుర్లు. అయితే 2021 సెప్టెంబర్ 13వ తేదీ ఉత్తేజ్ భార్య పద్మ అనారోగ్యంతో మృతి చెందింది. కొంతకాలంగా క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్న పద్మ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. భార్య మరణంతో ఉత్తేజ్ విషాదంలో మునిగిపోయాడు.

ఇప్పటికీ భార్యని తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నాడు. ఇటీవల పెళ్లిరోజు సందర్భంగా ఉత్తేజ్ తన భార్యని తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ఏప్రిల్ 8న ఉత్తేజ్ – పద్మ ల పెళ్లి రోజు సందర్భంగా ఉత్తేజ్ తన ఫేస్బుక్ లో భార్యను తలచుకుంటూ ఎమోషనల్ లెటర్ పోస్ట్ చేశాడు. ఈ లెటర్ లో ఉత్తేజ్ స్పందిస్తూ.. “పద్దూ…. మనకు పెళ్లిరోజు శుభాకాంక్షలు. జీవితంలో నిన్ను చాలా మిస్ అవుతున్నా. నువ్వు, నేను మనం అయినా ఈరోజు.. కుటుంబ వ్యవస్థకు నాందివాచకం పలికిన రోజు.

పెళ్లికి ముందు నన్ను ప్రేమిస్తున్నానని మా నాన్నకు ఉత్తరం రాశావు. మా నాన్న కూడా చిరునవ్వుతో మన పెళ్ళికి అంగీకరించాడు. ఇలా ఇద్దరం కలిసి మన ప్రయాణం మొదలు పెట్టాము. నాలో సగమై వచ్చి, నాతో సగమై నడిచి ..ఎంతో సంతోషంగా జీవితం గడుపుతున్న సమయంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావు. తిరిగిరాని రోజుల కోసం తిరిగి తిరిగి చూస్తున్న లవ్ యు పద్దు..” అంటూ ఎమోషనల్ లెటర్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ లెటర్ వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -