Ricky Ponting: అసలు ఇదేం పిచ్.. గబ్బాపై పాంటింగ్ షాకింగ్ కామెంట్స్

Ricky Ponting: క్రికెట్ వర్గాల్లో అత్యంత సహజంగా చర్చించుకునే అంశాల్లో పిచ్ ఎలా ఉందనేది. టెస్టు మ్యాచుల్లో ఆతిథ్య దేశాలకు అనుకూలించాలనే ఉద్దేశంతో నచ్చిన ట్రాక్ లను రెడీ చేసుకుంటారు. భారత్ లాంటి ఉపఖండ దేశాల్లో ఎక్కువగా స్పిన్ ట్రాక్ లను సిద్ధం చేస్తుంటారు. అయితే దీనిపై ఎప్పుడూ విమర్శలు వస్తూనే ఉంటాయి. టీమిండియా సులువుగా గెలవాలనే ఇలా చేస్తోందన్న కామెంట్స్ తరచూ వింటూనే ఉంటాం. ఇప్పుడు అలాంటి విమర్శలనే ఆస్ట్రేలియా జట్టు ఎదుర్కొంటోంది.

 

ఆస్ట్రేలియా పిచ్ లు సహజంగా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలం. అయితే కొన్నిసార్లు టీమ్ మేనేజ్ మెంట్ పిచ్ పై పచ్చికను ఎక్కువగా ఉండేలా తయారు చేయిస్తాయి. దీని వల్ల అదనపు బౌన్స్ తోపాటు వేగం కూడా పెరుగుతుంది. ఇలాంటి పిచ్ లు చాలా ప్రమాదరమని అనొచ్చు. బ్యాట్స్ మన్ లకు గాయాలయ్యే చాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు గబ్బా పిచ్ కూడా ఇలాగే తయారై విమర్శలను ఎదుర్కొంటోంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్ కేవలం రెండ్రోజుల్లోనే ముగిసింది. ఈ పిచ్ మీద ఆడటం సేఫ్ కాదని సఫారీ సారధి డీన్ ఎల్గర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

 

తక్కువ రేటింగ్ తప్పదు!
గబ్బా లాంటి మైదానాల్లో ఆడటం కష్టమని.. ఆటగాళ్లకు గాయాలయ్యే ప్రమాదం ఎక్కువని ఎల్గర్ అన్నాడు. అయితే ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాత్రం పిచ్ బాగానే ఉందంటూ గ్రౌండ్ స్టాఫ్​ ను వెనకేసుకొచ్చాడు. ఇప్పుడీ విషయంపై ఆసీస్ మాజీ ప్లేయర్ రికీ పాంటింగ్ స్పందించాడు. తన కెరీర్ లో ఇలాంటి పిచ్ ను ఇంతవరకూ చూడలేదని ఆయన అన్నాడు. ఈ పిచ్ మీద సీమ్ మూమెంట్ మరీ ఎక్కువగా ఉందని.. దీనికి కచ్చితంగా చాలా తక్కువ రేటింగ్ వస్తుందని అనుకుంటున్నట్లు పాంటింగ్ పేర్కొన్నాడు.

 

వికెట్ల వర్షం..
ఇక గబ్బాలో జరిగిన తొలి టెస్టులో చాలా తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. తొలి ఇన్నింగ్సులో సౌతాఫ్రికా 152 రన్స్ కు ఆలౌట్ అయింది. ఆసీస్ 218 పరుగులు చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్ లో పిచ్ బౌలర్లకు విపరీతంగా సహకరించడంతో దక్షిణాఫ్రికా 99 పరుగులకే చాపచుట్టేసింది. నిర్ణీత 34 రన్స్ ను ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా కూడా 4 వికెట్లు కోల్పోయింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -