Romantic wedding shoot: రొమాంటిక్ వెడ్డింగ్ షూట్..వధూవరుల ఫన్నీ స్టెప్పులు

Romantic wedding shoot: పెళ్లంటే పందిళ్లు, తాళాలు, తలంబ్రాలు అని అందరూ అంటారు. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ లో మార్పు వచ్చింది. ఇప్పుడంతా కొత్త ట్రెండ్ నడుస్తోంది. పెళ్లికి సంబంధించిన వీడియోలు ఈ మధ్యన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ అయినా కాకపోయినా కూడా వివాహాలకు సంబంధించిన పలు వీడియో నెట్టింట సందడి చేస్తున్నాయి. అందులో కొన్ని అందరి మనసులను హత్తకుంటుంటే మరికొన్ని ఫన్నీగా ఉంటున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి వైరల్ అవుతోంది.

 

ప్రస్తుతం ఏ పెళ్లి జరిగిన ఆ పెళ్లికి ముందు వధూవరులు ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతోంది. ఇదొక ఆనవాయతీగా మారుతోంది. వెడ్డింగ్ షూట్ పేరుతో వధూవరులు ఇష్టానుసారంగా ఫొటోలు, వీడియోలను తీయించుకుంటున్నారు. తాజాగా అలాంటి వెడ్డింగ్ షూట్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అది అందరికీ ఫన్నీగా అనిపిస్తోంది.

 

వీడియోలో వధూవరులు ఇద్దరూ రొమాంటిక్ స్టైల్‌లో వెడ్డింగ్ పోజులు ఇస్తూ కనపడుతారు. ఆ తర్వాత వధూవరులు ఇద్దరూ పెళ్లి వేదికపై డ్యాన్స్ చేస్తారు. అందులో భాగంగా రొమాంటిక్ స్టిల్స్ ఇస్తూ సందడి చేస్తుంటారు. అయితే ఆ టైంలో వధువు కిందకు జారి పడిపోవడంతో అక్కడున్నవారంతా వారిని చూసి నవ్వుకుంటారు.

 

ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా దీనికి ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఈ వీడియోకు 90 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 5 లక్షల 45 వేల మందికి పైగా దీన్ని లైక్ చేయడమే కాదు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు రోజూ చాలానే సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. పెళ్లంటే ఈ రోజుల్లో ఆమాత్రం ఉండాలిలేండి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -