Fraud: ఆ పెద్ద సినిమా పేర్లతో రూ. 6 కోట్లతో పరార్‌

Fraud: ప్రస్తుత సమాజంలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెలియకుండా పోయింది. క్లారిటీగా చెప్పాలంటే నమ్మకం అనేదే లేకుండా పోయింది. కొందరు మాయమాటలు చెప్పి అమాయకంగా నటిస్తూ అప్పుగా డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తీసుకునేటప్పుడు సమయానికి ఇస్తామని ఆ తర్వాత అడిగితే పారిపోవడం లేదంటే.. ఎదురు తిరగడం జరుగుతోంది. డబ్బు ఇచ్చేవారు ఇళ్లు, కార్లు తాకట్టు పెట్టి ఇస్తే తీసుకున్నవారు తిరిగి ఇవ్వకుండా పారిపోవడంతో వీరు దిక్కుతోచని స్థితిలో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

సినిమాల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.6 కోట్ల టోపీ పెట్టారు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన అంజమ్మ చౌదరి, నాగం ఉమాశంకర్‌. సినీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వారి సమీప బంధువులనే టార్కెట్‌ చేసి మోసాలకు తెర లేపారు. తమతకు సినీమా రంగంలో చాలా మంచి పరియయాలున్నాయిన ఆర్‌ఆర్‌ఆర్, అల వైకుంఠపురం, లవ్‌ స్టోరీ, వెంకీమామ, నాంది లాంటి సినిమాల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని నమ్మించారు.

వారి మాటలు నమ్మిన పలువురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు పెద్ద మొత్తంలో డబ్బును ఇచ్చారు. అయితే ఎంతకీ లాభాలు దేవుడెరుగు, ఇచ్చిన డబ్బులు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి అంజమ్మ, ఉమాశంకర్‌ను నిలదీశారు. అయితే అంజమ్మ, ఉమాశంకర్‌ మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు. గత్యంతరం లేక బాధితులు సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఇద్దరి చేతిలో దాదాపుగా 30 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వారి బంధువులు మోసపోయినట్లుగా పోలీసులు విచారణలో తేలింది. ఇంకా ఎవరైనా వీరికి డబ్బులు ఇచ్చినట్లైతే నేరుగా సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీస్‌ ఉన్నతా«ధికారులు పేర్కొంటున్నారు. వీరి గురించి పూర్త సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -