Sangeetha: విడాకులు తీసుకోవాలని ఫిక్స్ అయిన సంగీత.. ఆ తర్వాత ఏమైందంటే?

Sangeetha: సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన నటి సంగీత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె మలయాళ పొలిటికల్ త్రిల్లర్ గంగోత్రి సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించింది. తర్వాత తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఈమె కెరియర్ లో ఖడ్గం సినిమా ఒక మైలురాయి అని చెప్పాలి. ఒక్క ఛాన్స్ అన్న డైలాగ్ ఆమెని ఎక్కడికో తీసుకెళ్లింది.

ఇక ఆమె పర్సనల్ విషయాలకి వస్తే..ఈమె 2009లో క్రిష్ అనే తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు మరియు సింగర్ ని పెళ్లి చేసుకుంది. ఈమెకి 2012లో ఒక కూతురు కూడా జన్మించింది. అయితే వీళ్ళ కాపురం గురించి ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది సంగీత. అటువైపు పెద్దలకి ఇటువైపు పెద్దలకి మేము పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అయినా మేమిద్దరినీ ఇష్టపడటంతో వాళ్లని ఎదిరించి పెళ్లి చేసుకున్న ఇరువర్గాల నుంచి మాకు తీవ్రమైన సమస్యలు ఎదురయ్యేవి.

 

ఆ ఒత్తిడిని భరించలేకపోయే దాన్ని. మా ఇద్దరివి భిన్న అభిరుచులు. ఒకరికి నచ్చినవి మరొకరికి నచ్చేవి కాదు. దానివల్ల కూడా ఇద్దరి మధ్య అనేకసార్లు సమస్యలు వచ్చాయి. ఒక్కొక్కసారి ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నానో అనిపించేది. విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకునేదాన్ని. కానీ విజయ్ చాలా మంచివాడు నేను లేకుండా తను ఉండలేడు. మెల్ల మెల్లగా ఇద్దరం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం ప్రారంభించాము.

 

జీవితంలో మనల్ని ప్రేమించేవారు దొరకడం చాలా కష్టం అలాంటి వాళ్ళని మిస్ అవ్వద్దు అని నాకు అతనే మోటివేట్ చేసేవాడు. నా భర్తకి తనకన్నా కూడా నేనంటేనే ఇష్టం. అలాంటి భర్త దొరకటం నా అదృష్టం అంటూ చెప్పుకొచ్చింది సంగీత. అయితే ఇప్పుడు ఆ జంట అన్యోన్యంగా ఉండి పలుజంటలకి ఆదర్శంగా నిలబడింది. ఒక అందమైన జీవితం వెనుక ఒక ముళ్ళ దారి ఉంటుందని మరొకసారి నిరూపించింది ఈ జంట.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -