Senior Actress Archana: సీనియర్ నటి అర్చన నటనకు దూరం అవడానికి అసలు కారణాలు ఇవేనా?

Senior Actress Archana: అర్చన ఒక భారతీయ ప్రముఖ నటి. ఈమె రెండు దశాబ్దాలు పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో నటించింది. ఈమె రెండు సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. అర్చన 1981లో మధుర గీతం అనే చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఆ తర్వాత 1982 లో వచ్చిన నిరీక్షణ సినిమా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. వరుస అవకాశాలతో కెరీర్ లో ముందుకు సాగుతూ తమిళ, మలయాళ భాషల లో వరుస అవకాశాలు రావడంతో అక్కడ కూడా తన నటనకు మంచి గుర్తింపు లభించింది.

ఇక తనకు నిరీక్షణ, లేడీస్ టైలర్, దాసి సినిమాలు ఎంతగానో నచ్చాయి. అయితే అర్చన వైవిద్యమైన పాత్రలో మాత్రమే నటిస్తుంది. ఏదైనా పాత్ర తనకు నచ్చితేనే చేస్తుంది కానీ అవకాశం వచ్చింది కదా అని ఏది పడితే అది చెయ్యదు. ఈమె డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వదు. ఇలా అనుకోవడం ద్వారానే ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది.

కానీ మనసుకు నచ్చిన సినిమాలు చేసినందుకు సంతృప్తిగా ఉందని తెలిపింది. బాలు మహేంద్ర వంటి గొప్ప దర్శకుల సినిమాలలో నటించినందుకు సంతోషంగా ఉందని తెలపడం జరిగింది. ఇక సినిమాలకు దూరమయ్యాక కుటుంబంతో సంతోషంగా గడిపానని తెలిపింది. 2007లో తల్లి పాత్ర ద్వారా మళ్ళీ సినీ ఇండస్ట్రీలోకి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.

ఇక తనకు గుళ్ళు గోపరలు తిరగడం అంటే ఎంతో ఇష్టమట. ఎక్కువగా మీడియాతో తన విషయాలు పంచుకోవడం నచ్చదని ఎక్కువగా సైలెంట్ గా ఉండడాన్ని ఇష్టపడతారట. ఇప్పుడు కూడా ఏవైనా మంచి పాత్రలు వస్తేనే మళ్లీ తెరపై కనిపిస్తాను లేదంటే ఇక చాలు అని పేర్కొనడం జరిగింది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -