Shanmukh Jaswanth: ఆ కారణంతో ఆస్పత్రి పాలైన షణ్ముఖ్‌ జశ్వంత్‌..

Shanmukh Jaswanth: ఇటీవల సోషల్‌ మీడియా ఎందరినో ఎక్కడెక్కడికో చేర్చింది. సాధారణ జీవితాన్న గడుపుతున్న వారిని ఓ హోదా వచ్చేలా చేసింది. పల్లెటూర్లు, గ్రామీణ ప్రాంతాల్లో నివాసిస్తున్న ఎందరినో పట్టణాలో స్థిర నివాసం ఏర్పచుకునేలా చేసింది సోషల్‌ మీడియా. దాని పుణ్యమా అంటూ ఎంతో మంది యువతీ యువకులు సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు. ఆ తర్వాత ఫాలోవర్స్‌ పెరిగి సీరియల్, లేదా చిన్న చిన్న సినిమా ఆఫర్లు, ఎంటటైన్‌మెంట్‌ ప్రోగామ్‌లలో పాల్గొని సంపాదిస్తున్నారు.

అలాంటి వారిలో ప్రముఖ యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ ఒకరు. తక్కువ సమయంలోనే చాలా ఫేమస్‌ అయిన ఎంతో మంది అభిమానులను సంపాదించాడు. పలు వెబ్‌ సిరీసులతో పాటు యూట్యూబ్‌ షాట్స్‌ ద్వారా తనౖదైన శైలిని చాటుకున్నాడు. అంతటితో ఆగకుండా సీజన్‌–5లో బిగ్‌బాస్‌ లోకి వెళ్లిన షణ్ముఖ్‌ జశ్వంత్‌ రెండవ స్థానంలో నిలిచాడు. షణ్ముఖ్‌ అనారోగ్యం కారణంగా ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తాలు చక్కర్లు కొడుతున్నాయి. షణ్ముఖ్‌ జశ్వంత్‌ పోస్ట్‌ చేసిన ఓ ఫొటో కూడా అభిమానులను కాస్త టెన్షన్‌కు గురి చేస్తోంది. ఆ తర్వాత షణ్ముఖ్‌ జశ్వంత్‌ ‘ఐ యాం ఫైన్‌’’ నేను బాగున్నాను..’ అంటూ పోస్ట్‌ పెట్టడంతో ఆయన అభిమానుల్లో హమ్మయ్య అనుకున్నారు.

డ్యాన్స్‌ వీడియోలు, షార్ట్‌ ఫిల్మ్‌లు, వెబ్‌ సిరీస్‌లో నటిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్, సినీ స్టార్స్‌ కు దీటుగా అభిమానులను సంపాదించుకున్నాడు. తద్వారా సీజన్‌– 5లో బిగ్‌ బాస్‌ హౌస్‌ లోకి అడుగుపెట్టి తనదైన శైలిలో ఆటతో ఎంతో మంది అభిమానులతో పాటు రెండవ స్థానాన్ని సంపాదించాడు. ఆ సిరితో ప్రవర్తించిన తీరుతో అంతే స్థాయిలో విమర్శకులను పెంచుకున్నాడు. అంతేకాక తన తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన దీప్తి సునయనను కూడా వదులుకునే పరిస్థితులు తెచ్చుకున్నాడు. ప్రసుతం షణ్ముఖ్‌ పలు షార్ట్‌ ఫిల్మ్‌ల్లో నడిస్తూ తన అభిమానులను అలరిస్తున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -