CM: సీఎం పదవిలో ఉన్న వ్యక్తి ఇంతకు దిగజారాలా.. మరీ దారుణమంటూ?

CM: వైసీపీ నేతలు, సీఎం జగన్ పైశాచికత్వం పరాకాష్టకు చేరింది. సీఎం పదవిలో ఉన్న జగన్ కూడా దిగజారి ప్రవర్తించడం ఏంటి అంటూ మండిపడుతున్నారు ఏపీ ప్రజలు. ముఖ్యంగా సీఎం జగన్ విపక్ష నాయకులపై అనువణువునా నిండిన అక్కసుతో దారుణాలకు పాల్పడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ ఆయన మనసులోని వికృత ఆలోచనలు మరింతగా బయటపడుతున్నాయి. విశాఖ జిల్లా సంగివలసలో వైకాపా శనివారం నిర్వహించిన సభే దీనికి నిదర్శనం. ఏ పార్టీ సభ జరిగినా వాళ్ల నాయకుల కటౌట్లు పెట్టుకోవడం ఆనవాయితీ. విపక్ష పార్టీలు, నాయకులను విమర్శించడం సహజం. కానీ వైకాపా సభ వద్ద ప్రతిపక్ష నాయకుల ఫొటోలతో కటౌట్లు పెట్టి, వాటికి బాక్సింగ్‌ బ్యాగ్‌లు కట్టి, సభకు వచ్చినవారిని పిడిగుద్దులు కురిపించాలని ప్రోత్సహించడం విపరీత పోకడ కాకపోతే మరేంటి?

 

ప్రభుత్వ ప్రజావ్యతిరేక, అస్తవ్యస్త నిర్ణయాలతో నష్టపోయిన వర్గాలవారు తమ నిరసనలో భాగంగా సీఎం, మంత్రుల దిష్టిబొమ్మలు తగలబెడితేనే పోలీసులు కేసులు పెడుతున్నారే? మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలో, ప్రతిపక్ష నాయకుల బొమ్మలతో ఉన్న కటౌట్లు పెట్టి, వాటిపై సభకు వచ్చినవారితో పిడిగుద్దులు కురిపించడం విద్వేషాల్ని రెచ్చగొట్టడం కాదా? ఇలాంటి వాటిని పోలీసులు ఎలా అనుమతిస్తున్నారన్న ప్రశ్నలు విపక్ష పార్టీలు, విజ్ఞులు, మేధావుల నుంచి ఎదురవుతున్నాయి. ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలి అన్న కసితో ఈ విధంగా వికృతి చేష్టలకు పాల్పడుతున్నారు సీఎం జగన్. తెదేపా, జనసేన పొత్తు, భాజపా నాయకులు తనను ఘాటుగా విమర్శించడం, కాంగ్రెస్‌పార్టీ తనకు వ్యతిరేకంగా సోదరి షర్మిలను రంగంలోకి దించడం వంటి పరిణామాలు జగన్‌కు నిద్ర లేకుండా చేస్తున్నట్టుంది.

చంద్రబాబు సహా ఆ పార్టీ ముఖ్యనేతలు పలువురిపై అక్రమ కేసులు పెట్టి, జైళ్లకు పంపినా జగన్‌లో కసి తీరలేదు. అందరిపై కక్ష తీర్చుకోడానికి ఈ కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్టున్నారు. సంగివలసలో జరిగిన వైకాపా సభ వద్ద తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో పాటు, మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత కిరణ్‌కుమార్‌రెడ్డి పోలికలతోను, కాంగ్రెస్‌ పార్టీకి గుర్తుగా సూటు, బూటు వేసుకున్న ఒక వ్యక్తి బొమ్మల్ని వికృతంగా చిత్రీకరించి చిన్న సైజు కటౌట్ల రూపంలో ఏర్పాటు చేశారు. వాటిముందు బాక్సింగ్‌ బ్యాగ్‌లు ఏర్పాటు చేశారు. సభకు వచ్చిన వైకాపా కార్యకర్తలు వాటిపై పిడిగుద్దులు కురిపించారు. అది చూసిన వైకాపా అగ్రనాయకులు పైశాచిక ఆనందం పొందారు.

 

విమర్శలను రాజకీయంగా ఎదుర్కోవడం, వారి ఆరోపణలను దీటుగా తిప్పికొట్టడం చూశాం గానీ, ఇలా బొమ్మలను కొట్టించి ఆనందించడం వైకాపా నాయకుల విపరీత మానసిక ప్రవర్తనకి అద్దం పడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైకాపా సభ వద్ద ఏర్పాటుచేసిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ కటౌట్ల చిత్రాల్ని జగన్‌ వీరాభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి పైశాచికానందం పొందుతుండగా దానిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ చురకలు వేస్తున్నారు. వైసిపి నేతలు సీఎం జగన్ పైశాచికత్వం పరాకాష్టకు చేరుకుంది. ఒక సీఎం పదవిలో ఉన్న వ్యక్తి మరి ఇంత దిగజారి ప్రవర్తించాలా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -