SIIMA Awards: SIIMA అవార్డ్స్.. పుష్ప హవా.. తగ్గేదేలే అంటోన్న బన్నీ!

SIIMA Awards: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2021కు సంబంధించిన నామినేషన్ లిస్ట్ బయటకు వచ్చింది. ఇందులో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం సినిమాల్లోని ది బెస్ట్ చిత్రాలు నామినేషన్‌లో పోటి పడతాయి. ఇక వాటిల్లోంచి జనాలు తమ ఓట్లతో గెలిపించే చిత్రాలకు సైమా అవార్డులు వస్తాయి. ఇక ఇప్పుడు సైమా 2021 నామినేషన్స్‌కు సంబంధించిన చిత్రాల జాబితా వచ్చింది.

ఈ పదో సైమా వేడుకులు ఈ సారి బెంగళూరులో జరగబోతోన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి 11 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన నామినేషన్ లిస్ట్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

పుష్ప (తెలుగు), కర్ణన్(తమిళ్), రాబర్ట్(కన్నడ), మిన్నళ్ మురళీ(మలయాళం)చిత్రాలు అత్యధిక కేటగిరిల్లో నామినేట్ అయ్యాయి.

ఇందులో తెలుగు నుంచి పుష్ప చిత్రం అత్యధికంగా 12 కేటగిరీల్లో నామినేట్ అయింది. ఆ తరువాత బాలయ్య నటించిన అఖండ చిత్రం పది కేటగిరిల్లో, జాతి రత్నాలు, ఉప్పెన ఎనిమిది కేటగిరిల్లో నామినేట్ అయి సత్తా చాటాయి.

తమిళంలో కర్ణన్ సినిమా అత్యధికంగా పది కేటగిరీల్లో, శివ కార్తికేయన్ డాన్ 9 కేటగిరీల్లో, మాస్టర్ తలైవి చిత్రాలు ఏడు కేటగిరీల్లో దుమ్ములేపబోతోన్నాయి. దర్శన్ హీరోగా నటించిన రాబర్ట్ చిత్రం కన్నడలో అత్యధికంగా అంటే పది కేటగిరిల్లో నామినేట్ అయింది. ఆతరువాత గరుడవాహన వృషభ అనే చిత్రం 8 కేటగిరిల్లో, యువరత్న ఏడు కేటగిరీల్లో నామినేట్ అయింది.

మలయాళంలో అయితే మిన్నళ్ మురళి చిత్రం పది కేటగిరిల్లో నామినేట్ అయింది. కురుప్ చిత్రం 8, మాలిక్, జోజి చిత్రాలు ఆరు కేటగిరిల్లో నామినేట్ అయి సత్తా చాటాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -