Simbu: ఎట్టకేలకు పెళ్లికి రెడీ అవుతున్న శింబు.. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయనున్నారా?

Simbu:  ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారందరూ కూడా పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే శర్వానంద్ పెళ్లి చేసుకొని ఓ ఇంటి వాడు అయ్యారు త్వరలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ క్రమంలోనే మరొక హీరో కూడా పెళ్లికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు శింబు పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయన నటుడుగా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళుతున్నటువంటి శింబు ఇదివరకే రెండుసార్లు హీరోయిన్లతో ప్రేమలో పడి వారితో బ్రేకప్ చెప్పకున్నారు. ఇక ముచ్చటగా మూడోసారి తన కుటుంబ సభ్యులు చూపించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

కోలీవుడ్ సమాచారం ప్రకారం శింబు పెద్దలకు వచ్చిన వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే ఆ అమ్మాయి ఫ్యామిలీకి కూడా సినీ బ్యాక్ గ్రౌండ్ ఉందని సమాచారం. ఇలా ఈ అమ్మాయితో త్వరలోనే ఈయన ఏడడుగులు నడవబోతున్నారంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయం గురించి ఎక్కడ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

ప్రస్తుతం ఈయన పెళ్లి గురించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇప్పుడే ఇద్దరు హీరోయిన్లను ప్రేమించే బ్రేకప్ చెప్పుకున్నారు. ఇప్పుడు పెళ్లి అంటూ మరొక అమ్మాయి జీవితాన్ని కూడా ఇలాగే నాశనం చేయనున్నారా లేకపోతే నిజంగానే పెళ్లి చేసుకుని కొత్త జీవితంలో సంతోషంగా గడపనున్నారా అన్న సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే ఈయన పెళ్లి విషయంలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే హీరో శింబు స్పందించాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -