Skinniest House: అన్న పై కోపంతో 2 అడుగుల వెడల్పుతో రెండస్తుల భవనం కట్టాడు.. ఎందుకో తెలుసా!

Skinniest House: ఆస్తి పంపకాలు జరిగేటప్పుడు సాధారణంగా ప్రతి ఇంట్లో గొడవలు జరుగుతుంటాయి. ఈ విషయంలో గొడవలతో పాటు ప్రాణాలు సైతం పోగొట్టుకుంటారు. తండ్రి సంపాదించిన ఆస్తిలో అన్నదమ్ములకు వాటా ఇచ్చేటప్పుడు వివాదాలు చోటు చేసుకుంటాయి. నాకు తక్కువ స్థలం వచ్చిందని అన్న.. కాదు నీకే ఎక్కువ స్థలం ఉందని తమ్ముడు ఇలా వివిధ కారణాలతో ఒకరికొకరు కొట్టుకుని ప్రాణాలు తీసుకుంటుంటారు. అయితే ఇక్కడ జరిగిన అన్నదమ్ముల ఆస్తి పంపకాల్లో తమ్ముడి చేసిన పనికి ఆశ్చర్యపోవాలో.. నవ్వాలో అర్థం కాక నెటిజన్లు తలలు పీక్కుంటున్నారు.
అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

 

లెబనాన్‌లోని బీరుట్‌కు సమీపం లో మనారా అనే పట్టణంలో ఇద్దరు ఓ కుటుంబం నివాసముంటుంది. ఆ కుటుంబంలో ఉన్న అన్నదమ్ములకు ఆస్తి పంపకాల విషయంలో గొడవలు తలెత్తాయి. అయితే ఇద్దరు అన్నదమ్ముల్లో అన్నకు ఎక్కువ స్థలంతో పాటు అన్నకు వచ్చిన స్థలం సముద్రం సమీపంలోనే ఉండటంతో దానికి ఎక్కువ విలువ ఉంటుందని తమ్ముడు బాగా కుమిలిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అదే స్థలం అన్న ఓ భారీ ఇంటిని నిర్మించుకున్నాడు. అతడి ఇంట్లో నుంచి చూస్తే సముద్రమంతా కనిపించేంది. ఈ విషయం తమ్ముడి మనస్సులో బాగా నాటుకు పోయింది.

 

దీంతో తమ్ముడు తన అన్నపై మరింత ఈర్ష్య పెంచుకున్నాడు. ఈ క్రమంలో అన్న ఇంటికి బాగా డిమాండ్‌ వచ్చేది. ఇది తెలుసుకున్న తమ్ముడు ఎలాగైన తన అన్న ఇంటికి ఉన్న డిమాండ్‌ తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాడు బీచ్‌కు అన్న ఇంటికి మధ్యలో తమ్ముడికి సంబంధించిన కొంత స్థలం ఉంది. ఆ కొద్దిపాటు స్థలంలోనే ఒకవైపు 2 అడుగులు, మరోవైపు 14 అడుగుల వెడల్పుతో ఏకంగా ఇంటినే నిర్మించాడు. అతి తక్కువ స్థలంలోనే ఉన్న ఆ ఇంట్లో కుటుంబాలు నివాసించేలా అన్ని రకాల సౌకర్యాలు సైతం సమకూర్చాడు. అయితే ఆ ఇంటి విషయమై సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. అయితే ఈ వార్త చదివిన కొందరు ఈ ఇంటికి ‘విద్వేçశ భవనం’ అని పిలిచేవారట. దాన్ని 1854లో కట్టినట్లు పేర్కొంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -