Sohel: సినిమా చూడాలంటూ ఎమోషనల్ అయిన సోహెల్.. ఏం జరిగిందంటే?

Sohel: బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ బూట్ కట్ బాలరాజు అనే సినిమాతో మన ముందుకి వస్తున్నాడు. ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు సోహెల్.గత కొన్ని రోజులుగా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు సోహెల్. తాజాగా బూట్ కట్ బాలరాజు సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం గ్రాండ్ గా జరిగింది. దీనికి బ్రహ్మానందం, సందీప్ కిషన్, సాయి రాజేష్ పలువురు ముఖ్య అతిథులుగా వచ్చారు. అయితే ఈ ఈవెంట్లో సోహెల్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు.

 

తన తండ్రి రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చిన పెన్షన్ డబ్బులతో పాటు తను సంపాదన అంతా ఈ సినిమాపై పెట్టేసాడు అయితే కష్టపడి సినిమా రిలీజ్ చేసిన తర్వాత తన సినిమా చూడడానికి జనం ధియేటర్ కి రాకపోవడంతో కన్నీటిపర్యంతం అయ్యాడు. నిజానికి సోహెల్ బిగ్ బాస్ కి ముందు చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ హీరో అవ్వటానికి చాలా కష్టపడ్డాడు. బిగ్ బాస్ షో తో క్రేజ్ సంపాదించుకొని వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే కష్టపడి సంపాదించిన సొమ్మునంత సినిమా పై పెట్టేయటం..


ఆ సినిమా చూడటానికి ప్రేక్షకులు రాకపోవడంతో కన్నీటి పర్యంతమయ్యాడు. చాలా షోలు క్యాన్సిల్ కావడంతో కంటెంట్ ఉన్న చిత్రాలను ఆదరిస్తామని అంటారు కదా అసలు ఈ సినిమా చూడకుండా కంటెంట్ ఉందో లేదో ఎలా తెలుస్తుందని వాపోయాడు. సినిమా చూస్తూ థియేటర్ నుంచే రివ్యూ రాస్తున్న ఒక ప్రబుద్ధుడు వీడియోని మీడియాకి చూపిస్తూ బోరున ఏడ్చాడు. సినిమా అనేది ఫ్రెండ్స్ తో మాత్రమే చూసేది కాదు ఫ్యామిలీతో చూసేది.

 

మాది అలాంటి సినిమానే మా సినిమాలో ఎక్కడా వల్గారిటీ లేదు. ఒక వ్యక్తి సినిమా చూడకుండానే సినిమా గురించి రివ్యూ రాసేస్తున్నాడు అని కన్నీటి పర్యంతమయ్యాడు సోహెల్. నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సోహెల్, సోహెల్ అన్నారు కదా ఇప్పుడు ఏమైంది మీకు దండం పెట్టి అడుగుతున్నాను థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి అంటూ మోకాళ్ళపై కూర్చొని రిక్వెస్ట్ చేశాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -