Sonia Aggarwal: మాజీ భర్త దర్శకత్వంలో నటిస్తానన్న సోనియా అగర్వాల్.. కానీ?

Sonia Aggarwal: ఉత్తరాది నటి సోనియా అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో 7/G బృందావన కాలనీ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె తమిళంలో కూడా పెద్ద ఎత్తున సినిమాలలో నటించారు అయితే ఈమె తమిళంలో వరుసగా మూడు సినిమాలు డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో నటించారు. ఇలా మూడు సినిమాలు వరుసగా చేసే సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ఆ ప్రేమ కాస్త పెళ్లి వరకు దారి తీసిందని తెలుస్తుంది.

 

ఇలా ప్రేమించుకున్న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు అయితే వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం పాటు సాగలేదని తెలుస్తుంది. కొన్ని మనస్పర్ధలు కారణంగా ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా విడాకులు తర్వాత ఎవరి వృత్తిలో వారు స్థిరపడ్డారు అయితే సెల్వ రాఘవన్ ఒకానొక సమయంలో దర్శకత్వానికి గుడ్ బై చెబుతూ నటుడిగా మారిపోయారు కానీ నటన ఆయనకు సెట్ కాకపోవడంతో తిరిగి డైరెక్టర్ గా మారారు.

ఇలా డైరెక్టర్ గా మారినటువంటి ఈయన 7/G బృందావన కాలనీ సినిమాకు సీక్వెల్ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే దానికంటే ముందుగా హీరో ధనుష్ నటించిన పుదుపేట్టై2 సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో ధనుష్ సరసన సోనియా అగర్వాల్, స్నేహ నటించారు. మరి సీక్వెల్ చిత్రంలో మీరు ఈ సినిమాలో నటిస్తున్నారా అనే ప్రశ్న సోనియాకు ఎదురయింది. దీంతో ఈమె ఆసక్తికర సమాధానం చెప్పారు.

 

ఈ సందర్భంగా సోనియా అగర్వాల్ మాట్లాడుతూ సెల్వ రాఘవన్ తో నేను పనిచేయడానికి వెనకాడటం లేదని తెలిపారు. నటన అనేది నా వృత్తిపరమైన జీవితం దాంతో తన మాజీ భర్తతో పని చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఈమె తెలియజేశారు. అయితే ఈ సినిమాలో తనని తీసుకుంటున్నారా లేదా అనే విషయం తనకు తెలియదని ఇప్పటివరకు నన్ను ఎవరు సంప్రదించలేదని తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారనే విషయాలు గురించి కూడా నాకు తెలియదు అంటూ సోనియా అగర్వాల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -