Sonam Kapoor: తల్లి అయిన స్టార్ హీరోయిన్.. వైరల్ పోస్ట్!

Sonam Kapoor: బాలీవుడ్ బ్యూటీ ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ గురించి మనందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఈమెకు బాలీవుడ్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉండే సోనమ్ కపూర్, ఆనంద్ ఆహుజాకు 2018 మే 8న వైవాహిక బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. గర్భం దాల్చిన విషయం కూడా తెలిసిందే. ఇదే విషయాన్ని సోనమ్ కపూర్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది.

ఇటీవల త్వరలోనే తల్లి కాబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ప్రెగ్నెన్సీ గా ఉన్నవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ ఒక సుదీర్ఘమైన పోస్టుని రాసుకోవచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఉంటే తాజాగా స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ అభిమానులకి ఒక గుడ్ న్యూస్ ని చెప్పింది. తాజాగా అంటే శనివారం ఆగస్టు 25వ తేదీన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది సోనమ్ కపూర్. ఇదే విషయాన్ని ఎంతో సంతోషంగా అభిమానులతో పంచుకుంది. అభిమానులు కూడా ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అభిమానులతో పాటు బాలీవుడ్ లోని పలువురు సెలబ్రిటీలు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా సోనమ్ కి పండంటి మగ బిడ్డ జన్మించడంతో ఆమె ఇంట్లో సంబరాలు జరుగుతున్నాయి. తనకు బిడ్డ పుట్టాడు అన్న విషయాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది. 2022 ఆగస్ట్ 20న మా అందమైన కుమారుడిని ఈ ప్రపంచంలోకి స్వాగతించాము.. ఈ ప్రయాణంలో మాకు సహాయం చేసిన వైద్యులు, నర్సులు, స్నేహితులు, కుటుంబసభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ఇది ప్రారంభం మాత్రమే..మా జీవితాలు ముందు ముందు మరింత అందంగా మారతాయని మాకు తెలుసు అని రాసుకొచ్చింది సోనమ్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -