Lorry Chase: ఇలాంటి వీఆర్వోలు నూటికో కోటికో ఒకరు పుడతారు.. గొప్పోళ్లంటూ?

Lorry Chase: ప్రభుత్వ ఉద్యోగులు అంటే చాలామందికి చిన్న చూపు ఉంటుంది. భారీగా అక్రమాలకు పాల్పడతారనే భావన ప్రజలలో ఉంది. అయితే ఏ కొందరి వల్ల చాలా నీతి నిజాయితీగా పనిచేసే ఉద్యోగులకు కూడా అలాంటి పేరు వస్తుందని చెప్పాలి. ఎంతోమంది ఉద్యోగులు తమ విధులకు కట్టుబడి ఉన్నారు. వారి పరిస్థితులు ఎలా ఉన్నా ఉద్యోగ నిర్వహణలో మాత్రం ఎంతో నిజాయితీగా ఉంటారని ఎంతోమంది నిరూపించారు. తాజాగా అలాంటి ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది.

కృష్ణాజిల్లా పామర్రు మండలం కొత్తూరులో వీఆర్వోగా మీనా అనే మహిళ విధి నిర్వహణలో ఉన్నారు. అయితే పసుమర్రు గ్రామసమీపంలో తరచూ అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా మరోసారి మట్టిని అక్రమంగా తరలిస్తున్న విషయాన్ని తెలుసుకున్నటువంటి మీనా తన పది నెలల బిడ్డను స్కూటీలో తనతో పాటు తీసుకెళ్లి ఆ లారీలను వెంబడించారు.

 

అక్రమంగా మట్టిని తరలిస్తున్నటువంటి ఈ లారీలను వెంబడించి ఈమె లారీలను సీజ్ చేశారు. అదే విధంగా ఈ అక్రమ తవ్వకాలకు పాల్పడినందుకు భారీగా జరిమానా కూడా విధించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీఆర్వో ధైర్య సాహసాల పై ప్రతి ఒక్కరు ప్రశంసల కురిపించడమే కాకుండా ఈమె ఎంతో నీతి నిజాయితీగా విధినిర్వహిస్తున్నారంటూ ఈమె పై సోషల్ మీడియా వేదిక ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -