YSRCP Leader: కబ్జాను ప్రశ్నించినందుకు వీఆర్వోపై దాడి చేసిన వైసీపీ నేత.. ఇవెక్కడి దారుణాలంటూ?

YSRCP Leader: మరి కొద్ది రోజులలో ఎన్నికలు జరగబోతున్నాయి వచ్చే ఎన్నికలలో తప్పకుండా వైసీపీ ఘోర పరాజయం పాలవుతుంది అంటూ ఇప్పటికే ఎల్లో సర్వేలు కూడా చెప్పాయి. అంతేకాకుండా ప్రజలలో కూడా మార్పు మొదలైంది ఇలా వచ్చే ఎన్నికలలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో రాదో కూడా తెలియని పక్షంలో వైకాపా నేతలు ఇప్పటికీ ప్రభుత్వ అధికారుల పైన పెద్ద ఎత్తున రౌడీయిజం చేస్తూ చెలరేగిపోతున్నారు.

ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని ప్రశ్నించినందుకు వీఆర్వో పై దారుణంగా వైకాపా నేత దాడి చేసిన ఘటన ధర్మవరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే సత్యసాయి జిల్లా ధర్మవరంలోని నరసింహులు అనే వ్యక్తి రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారు. ఇదే విషయంపై వీఆర్వో ప్రశ్నించగా నరసింహులు వీఆర్వో పై దాడికి దిగారు.

ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా కంచ వేయడంతో ఆ కంచె తొలగించాలని అంతేకాకుండా ఆ స్థలానికి సంబంధించిన పత్రాలను తీసుకురావాలని వీఆర్వో అశోక్ నర్సింహులకు సూచించారు. ఇలా మంగళవారం ఆయనకు సమాచారం అందించిన ఎలాంటి పత్రాలు తీసుకురాకపోవడంతో విఆర్వో ఆ కంచను తొలగించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నరసింహులు సచివాలయానికి వెళ్లి వీఆర్వో అశోక్ పై వాగ్వాదానికి దిగారు.

ఈ విధంగా విఆర్వోతో గొడవ పడినటువంటి నరసింహులు తన చెంపపై చేయి చేసుకున్నారు. అనంతరం కుర్చీలు విరగొట్టారు. ఇక కంప్యూటర్ కూడా ధ్వంసం చేయడంతో తోటి ఉద్యోగులు భయపడి వెంటనే తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -