Swapna Suresh: స్వప్న సురేశ్ సంచలన ఆరోపణలు.. ఆ మంత్రులు లైంగికంగా వేధించారంటూ..!

Swapna Suresh: ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులపై ఆరోపణలు రావడం చూస్తేనే ఉన్నాం. సెలబ్రిటీలు, రాజకీయ నాయకురాళ్లు, తదితరులు ఇంటర్వ్యూల్లో తమపై ఓ రాజకీయ నేత, నిర్మాత, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సంచలన ప్రకటన చేస్తున్నారు. ఇదే తరహాలో ఓ వార్త సంచలనం సృష్టించింది. గతంలో కేరళ రాష్ట్రంలో సంచలనం సృస్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ తాజాగా కీలక ఆరోపణలు చేశారు. ఆమెను ఇద్దరు మాజీ మంత్రులు లైంగికంగా వేధించాలని మీడియా వేదికగా వెల్లడించారు.

స్వప్న.. 30 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. 2020లో జాతీయ దర్యాప్తు సంస్థ స్వప్న సురేష్, సందీప్ నారాయణ్‌ను అదుపులోకి తీసుకుంది. 16 నెలలపాటు జైలు జీవితాన్ని కూడా గడిపింది. గతేడాది నవంబర్ నెలలో జైలు నుంచి విడుదలైంది. జైలును విడుదలైన స్వప్న సురేష్ అప్పటి నుంచి కేరళ సీఎం పినరై విజయన్, ఆయన కుటుంబసభ్యులపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆమె ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె ఇద్దరు మంత్రులు తనను లైంగికంగా వేధించాలని పేర్కొంది.

సీపీఎం పార్టీకి చెందిన మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్, మాజీ స్పీకర్ శ్రీరామ కృష్ణన్, థామస్ ఐజాక్‌ తనను లైంగికంగా వేధించారని సంచలన విషయాలు వెల్లడించింది. గతంలో కడకంపల్లి సురేంద్రన్ ఆమెను కొచ్చిలోని ఓ హోటల్‌కి రమ్మపిలిచాడని చెప్పింది. అలాగే శ్రీరామ కృష్ణన్ కూడా తన ఇంటికి రమ్మని పిలిచినట్లు పేర్కొంది. థామస్ ఐజాక్ కూడా తనను మున్నార్‌ టూర్‌కి వెళ్దామని, అక్కడికి రమ్మని పిలిచినట్లు స్వప్న సురేష్ తెలిపింది. లైంగికంగా వేధించేవారని, అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టి ఇబ్బందులకు గురి చేసేవారని ఆరోపించింది. ఈ విషయాలు ఐపీఎస్ అధికారి శివశంకర్‌కు కూడా తెలుసని ఆమె చెప్పింది. కడకంపల్లి సురేంద్రన్‌కు రాజకీయ నేతగా ఉండే అర్హత లేదని, వీరిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా, స్వప్న చేసిన ఆరోపణలపై ఈ ముగ్గురు నేతలు స్పందించాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -