CM YS Jagan: ముగ్గురు మంత్రులపై జగన్ వేటు? త్వరలోనే మళ్లీ కేబినెట్ విస్తరణ?

CM YS Jagan:  ఏపీలో మళ్లీ కేబినెట్ విస్తరణ జరగబోతుందనే వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి. త్వరలో మళ్లీ మంత్రివర్గ పునర్‌వ్యవస్ధీకరణ జరగబోతుందని, ఆ దిశగా సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. నవంబర్ లో మంత్రివర్గ విస్తరణకు కూడా ముహూర్తం ఫిక్స్ అయిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండటంతో ఎన్నికల టీమ్ ను జగన్ సిద్దం చేసుకోనున్నారని, అందులో భాగంగా కేబినెట్ విస్తరణ చేపడతారని టాక్ వినిపిస్తోంది.

ఈ కేబినెట్ విస్తరణలో భాగంగా పనితీరు బాగాలేదని ముగ్గురు మంత్రులపై వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో ఓ మహిళా మంత్రి కూడా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీకి గట్టి కౌంటర్ లు ఇవ్వడంలో ముగ్గురు మంత్రులు విఫలం అవుతున్నారని, ప్రభుత్వంపై ప్రతిపక్ష టీడీపీ చేసే విమర్శలు, ఆరోపణలకు ముగ్గురు మంత్రులు అసలు కౌంటర్లు ఇవ్వడం లేదని, సైలెంట్ గా ఉంటున్నారని జగన్ గుర్తించారట. జగన్ పై, వైసీపీ సర్కార్ పై చేసే విమర్శలను అసలు ఆ మంత్రులు పట్టించుకోవడం లేదట.

ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ముగ్గురు మంత్రులకు జగన్ క్లాస్ పీకినట్లు చెబుతున్నారు. తనపై, తన కుటుంబంపై విమర్శలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆ ముగ్గురు మంత్రులకు జగన్ వార్నింగ్ ఇచ్చారట. కానీ జగన్ క్లాస్ తీసుకున్నా సరే.. ఆ ముగ్గురు మాత్రం లైట్ తీసుకున్నారట. తర్వాతి రోజు అయినా ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష టీడీపీకి కౌంటర్ ఇవ్వలేదు. మంత్రి బొత్స సత్యనారాయణ ఒక్కరే జగన్ ఫ్యామిలీపై టీడీపీ విమర్శలు చేయడానికి ఖండించారు. మిగతా మంత్రులెవ్వరూ అసలు కౌంటర్లు కూడా ఇవ్వలేదు.

లిక్కర్ కుంభకోణంలో జగన్ సతీమణి భారతి ఉందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ ఆరోపణలపై మంత్రులు కౌంటర్ ఇవ్వలేదు. దీంతో జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ముగ్గురు మంత్రులను త్వరలో కేబినెట్ నుంచి తొలగించే అవకశముందని ప్రచారం జరుగుతోంది. జగన్ గత ఏప్రిల్ లో కేబినెట్ విస్తరణ చేపట్టారు. కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారరం చేయించారు. పాతవారిలో 11 మందిని కొనసాగించారు. మంత్రి కొడాని నాని, పేర్నినానిని తొలగించినా.. వారు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.

కానీ ప్రస్తుతం కేబినెట్ లో ఉన్నవారిలో ముగ్గురు మంత్రులు అసలు కౌంటర్లు ఇవ్వలేదని జగన్ కు రిపోర్టులు వెళ్లాయి. దీంతో వారిపై జగన్ అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ వర్గాల్లో్ ఈ విషయం చర్చనీయాంశం కావడంతో వైసీపీ మంత్రులు స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి జోగి రమేష్ కేబినెట్ విస్తరణ వార్తలపై స్పందించారు. సమర్థత లేని వాళ్లను తీసేస్తే తప్పు లేదని, ప్రతిపక్షాల విమర్శలకు భయపడేవారు కేబినెట్ లో ఉన్నా ఒక్కటే.. ఊడినా ఒకటే అని మంత్రి అన్నారు. యుద్దానికి భయపడేవారు ఉండటం సరికాదనేతి తన అభిప్రాయమన్నారు.

బాధ్యత మరిచిపోయి పదవి వచ్చిందని భావించడం సరికాదని జోగి రమేష్ తెలిపారు. ఎఫెక్టివ్ గా పని చేయాలని సీఎం సూచించారని, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని తెలిపారు. శాఖాపరంగా పట్టు సాధించడం తమ బాధ్యత అని వ్యాఖ్యానించారు. ఇక మరో మంత్రి మేరుగ నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. భయపడే మంత్రులు ఉన్నా, లేకున్నా ఒకటేనని అన్నారు. పరిపాలనలో ఎలాంటి మార్పులైనా చేసేందుకు సీఎం జగన్ కు అధికారాలు ఉన్నాయిన మేరుగ నాగార్జున అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలకు భయపడే మంత్రులు ఎవరున్నారో మీడియాకే తెలియాలని కీలక వ్యాఖ్యలు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -