Sridevi – Sucharitha: అర్దరాత్రి హైడ్రామా.. సుచరిత ఇంటి ముందు శ్రీదేవి ఆందోళన.. ఆమెకు వైసీపీ చెక్ పెట్టినట్టేనా?

Sridevi – Sucharitha: వైసీసీ వర్గాల్లో ఇప్పుడు ఓ విషయం హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై.. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అర్ధరాత్రి వేళ అనుచరులతో ఆందోళనకు దిగారు. మాజీ హోం మంత్రి, వైసీసీ జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటి ముందు నిరసన చేపట్టారు. అధిష్టానంతో చ‌ర్చిస్తాన‌ని సుచరిత హామీ ఇవ్వ‌డంతో ఉండవల్లి శ్రీదేవి, ఆమె అనుచరులు ఆందోళనను విరమించారు. అసలు వైసీపీ అధిష్టానం తీసుకున్ని నిర్ణయం ఏమిటి..?, దానిని ఉండవల్లి శ్రీదేవి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..?, ఆమె భవిష్యత్తు కార్యచరణ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి.. నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్‌గా కొనసాగుతున్నారు. అయితే తాడికొండ నియోజకవర్గం వైసీపీ అద‌న‌పు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్‌ను వైసీపీ అధిష్టానం నియమించింది. ఇది ఉండవల్లి శ్రీదేవిని ఆందోళనకు గురిచేసింది. డొక్కా మాణిక్య వరప్రసాద్‌ గతంలో తాడికొండ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి.. పార్టీ అద‌న‌పు స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియమించడమే ఆమె టెన్షన్‌కు కారణం.

అయితే నియోజకవర్గంలోని కొందరు వైసీపీ నాయకులు.. ఉండవల్లి శ్రీదేవి వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం ఉంది. ఆమె తన అనుచరులకు తప్ప ఇతరులకు అందుబాటులో ఉండరనేది వారు చెబుతున్న మాట. ఈ క్రమంలోనే కొందరు వైసీపీ అధిష్టానం దృష్టికి ఈ పరిస్థితిని తీసుకెళ్లారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ వైసీపీ అదనపు సమన్వయకర్తగా డొక్కాను నియమించడంతో.. ఆమెకు చెక్ పెట్టేందుకేనన్న ప్రచారం జోరుగా సాగుతుంది.

తాజా నియామకంతో డొక్కా.. నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహించేందుకు పార్టీ ఆమోదం లభించినట్టు అయింది. ఈ నేపథ్యంలోనే పార్టీ శ్రేణులకు మరింత దగ్గరైతే, ప్రజలతో మంచి సంబంధాలు.. నెక్ట్స్ ఎమ్మెల్యే టికెట్ సాధించవచ్చనే ఆశ ఆయనలో ఉందనే ప్రచారం ఉంది. ఈ పరిణామాలు ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి ఆందోళనకు గరిచేస్తుంది.

భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి..?

పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉండవల్లి శ్రీదేవి.. నేరుగా పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించే ధైర్యం చేయకపోవచ్చనే చెప్పాలి. అందుకే సుచ‌రిత ఇంటి ఎదుట ఆందోళన చేపట్టి.. తన డిమాండ్‌ను తెలియజేశారు. అదే సమయంలో పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని నాయకులు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. అయితే శ్రీదేవి హెచ్చరికలు వైసీపీ అధిష్టానం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా? అనేదే ఇక్కడ ప్రశ్న.

అధిష్టానం ఆలోచన అదేనా..?

వైసీపీ అధిష్టానం ముందుగానే తాడికొండ నియోజకవర్గం విషయంలో జాగ్రత్త పడుతుందనే ప్రచారం లేకపోలేదు. ఉండవల్లి శ్రీదేవి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండగా.. సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఆమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని వైసీపీ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. ఆమెకు చెక్ పెట్టిన జగన్.. అక్కడ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి డొక్కా మాణిక్యవరప్రసాద్ నియోజవర్గ అదనపు సమన్వయకర్త బాధ్యతలను అప్పగించారనే టాక్ వినిపిస్తోంది. డొక్కాకు వైసీపీ అధిష్టానంతో సన్నిహిత్యం ఉండటం కూడా ఇందుకు మరోక కారణంగా చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -