CM Jagan: సీఎం జగన్ ను ఇరుకున పెట్టేలా టీడీపీ మైండ్ గేమ్.. సీఎం జగన్ కు చుక్కలే అంటూ?

CM Jagan: రాజకీయ చదరంగం ఆడటం అంత సులువైన పని కాదు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ, వెంట వెంటనే పావులు కలపాలి. లేదంటే ఆటలో పాములు మింగితే ఎక్కడ బయలుదేరామో అక్కడే వచ్చి పడతాము. ఈ ఆటకి వయసుతో సంబంధం లేదు. కేవలం మైండ్ తోనే ఆడవలసిన ఆట రాజకీయం. ఇప్పుడు ఆంధ్రదేశంలో జరుగుతున్నది అదే. జనసేన ని ఎలాగైనా ఓడించాలనే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు ఒక మెట్టు దిగి ఢిల్లీలో ఉన్న బీజేపీ నాయకుల్ని కలిసి రాజకీయమంతనాలు జరిపారు.

అయితే జగన్ కదిపిన పావు కి జైలు పాలయ్యారు చంద్రబాబు.బహుశా ఆయన జైలుకు వెళ్తానని, ఇన్ని రోజుల పాటు జైల్లో ఉండాల్సి వస్తుందని ఊహించి ఉండరు. ఇప్పటికే చంద్రబాబును జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని ప్రచారం గట్టిగా జరుగుతుంది. కేవలం ఆంధ్ర, తెలంగాణ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ చంద్రబాబు అరెస్టునే ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.

అయితే ఇప్పుడు టీడీపీ చంద్రబాబు అరెస్టుపై మరింత రాజకీయ కాక రగిలించేందుకు సరికొత్త ప్లానింగ్ తో ముందుకి వస్తుంది. ఏపీ రాజకీయాలలో మంట పుట్టించేలా భారీ వ్యూహానికి తెలుగుదేశం పార్టీ తెరతీయ నుంది. అందుకు ఏపీ అసెంబ్లీని వేదికగా చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది టీడీపీ . గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలలో బాబు అక్రమ అరెస్టు ప్రస్తావించడం ద్వారా చర్చ పెట్టేందుకు తెలుగుదేశం ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు.

ఈ సమావేశాల ఆఖరి రోజునే చంద్రబాబు మినహా మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు తమ పదవులతో మూకుమ్మడి రాజీనామాలు చేస్తూ స్పీకర్ కు అందజేసే ఆలోచనలో తెలుగుదేశం ఉన్నట్లు తెలుస్తోంది. మామూలుగా ఆరు నెలల్లోనే ఉప ఎన్నికలు రావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నికలు అంటే అది జగన్ కే పెద్ద రిస్క్. ఇదే జరిగితే జగన్ తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -