Irfan Pathan: ఇర్ఫాన్‌ పఠాన్‌ కెరియర్‌ నాశనానికి ఆ కెప్టన్‌ కారణమట!

Irfan Pathan: భారత్‌ క్రికెట్‌ టీంలో అందరికన్నా మహేంద్రసింగ్ ధోనికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా మైదానంలోకి అడుగుపెట్టిన ధోని తనదైన శైలిలో ఆడి మరిచిపోలేని ముద్ర వేసుకున్నారు. పదుల సంఖ్యలో ఓడిపోతున్న మ్యాచ్‌లను ఒంటి చేత్తో గటెక్కించేన ఘటనలు చాలానే ఉన్నాయి. ధోని సారథ్యంలో రెండు ప్రపంచ కప్‌లను దేశానికి అందించి శభాష్‌ ధోని అనిపించాడు. ధోని తర్వాత ఎవరూ కూడా దేశానికి ప్రపంచకప్‌ తీసుకురాలేదు.

మ్యాచ్‌ ఓడిపోయే స్థితిలో ఉండి మహీ గ్రౌండ్‌లో దిగితే చాలు అభిమానుల్లో ఊపిరి వచ్చేది. ఎందుకంటే ధోనిపై ఉన్న నమ్మకం అలాంటిది. గ్రౌండ్‌లో దిగాడంటే గెలుపును తీసుకొనే వస్తాడని. ఇంత క్రేజీ ఉన్నా ధోని సారథ్యంలో ఎన్నో విజయాలు సాధించినా కెప్టన్‌గా ఉన్నప్పుడు కొంత మంది ఆటగాళ్ల విషయంలో వివక్ష చూపడంతో వారు ఇప్పటి వరకు కోలుకోలేదనే వార్తలు అప్పట్లో చాలా వైరల్‌గా మారాయి.

లేజెండ్‌ క్రికెట్ లీగ్ లో భాగంగా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక అభిమాని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇర్ఫాన్‌ పఠాన్‌ కెరియర్‌ నాశనం కావడానికి ధోని మేనేజ్మెంట్ ఒక కారణమంటూ రాసుకొచ్చాడు. 29 ఏళ్లలోనే ఇరా‍్ఫన్‌ పఠాన్‌ తన కెరీర్‌లో చివరి మ్యాన్‌ ఆడాడంటే నమ్మశక్యంగా లేదు. అతను 7వ స్థానంలో సరైన ఆటడాడు. కానీ.. ఆ స్థానంలో రవీంద్ర జడేజా, బిన్నిని ఆడించారని మరికొంత మంది అభిమానులు చెప్పుకొచ్చారు. ఈ పోస్టు చూసిన ఇర్ఫార్‌ పఠాన్‌ వెంటనే స్పందించాడు. ‘ఎవరినీ నిందించొద్దు.. మీ ప్రేమకు థ్యాంక్యూ’ అంటూ పోస్ట్‌ పెట్టాడు.

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -