SRH Pathan: విలియమ్సన్ ప్లేసులో అతడ్ని తీసుకోవాలి.. ఎస్ఆర్‌హెచ్‌కు పఠాన్ సూచన

SRH Pathan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 2023 వేలానికి సమయం దగ్గర పడింది. కేరళలోని కొచ్చి వేదికగా శుక్రవారం (డిసెంబర్ 23)ర ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కొనుగోలు అంశంపై దృష్టి సారించాయి. ఏ ప్లేయర్లను తీసుకోవాలనే దాని మీద ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఈ వేలంపై పూర్తిగా దృష్టి పెట్టింది. ఆ జట్టుకు ఇప్పుడు ఓపెనర్ తోపాటు కెప్టెన్ కూడా అవసరం. కేన్ విలియమ్స్ ను వదులుకున్నందున బలమైన మరో ఆటగాడి కోసం బిడ్డింగ్ లోకి ఎస్ఆర్‌హెచ్ దిగుతోంది.

 

కేన్ మామను వదులుకున్న ఎస్ఆర్‌హెచ్
కేన్ విలియమ్స్ సారథ్యంలో గతేడాది బరిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్ జట్టు దారుణంగా విఫలమైంది. ఆడిన 14 మ్యాచుల్లో ఆరింట గెలిచి.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. దీంతో రూ.14 కోట్లు వెచ్చించి కొనుక్కున్న కేన్ మామను ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం మినీ వేలానికి ముందు అతడితో బంధాన్ని తెంచుకుంది
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఎస్ఆర్‌హెచ్ ఓపెనింగ్ స్థానం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

 

విలియమ్సన్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు మయాంక్ అగర్వాల్ అంటూ పఠాన్ సూచించాడు. ఓ స్పోర్ట్స్ చానెల్ లో పఠాన్ మాట్లాడుతూ.. ‘ఎస్ఆర్‌హెచ్ మయాంక్ అగర్వాల్ ను కొనుక్కుంటుందని అనుకుంటున్నా. వాళ్లకు దూకుడుగా ఆడే ఓ ఓపెనర్ అవసరం ఉంది’ అని చెప్పాడు. మయాంక్ ను ఓపెనింగ్ లో ఆడించడమే గాక జట్టు సారధ్య బాధ్యతలను అప్పజెప్పేందుకు కూడా ఎస్ఆర్‌హెచ్ తీసుకునే చాన్స్ ఉందని తెలుస్తోంది.

 

కేన్ ప్లేసులో మయాంకే బెస్ట్ చాయిస్!
కేన్ విలియమ్సన్ స్థానంలో మయాంక్ అగర్వాల్ ను తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని పఠాన్ అన్నాడు. దూకుడుగా ఆడటంతో గతంలో పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం కూడా అతడి సొంతమని పేర్కొన్నాడు. ఒకవేళ నిజంగానే మయాంక్ ను సన్ రైజర్స్ కొనుగోలు చేస్తే ఓపెనింగ్ స్థానానికి చక్కటి ఆప్షన్ దొరికినట్లేని చెప్పొచ్చు.

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -