Kidnap: యువతి ప్రేమించలేదని 100 మందితో వచ్చి కిడ్నాప్..10 గంటల్లో కేసును చేధించిన పోలీసులు

Kidnap: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసు ఎట్టకేలకు ముగిసింది. కిడ్నాప్ కు గురైన వైశాలిని పోలీసులు రక్షించి ఆమెను క్షేమంగా ఇంటికి తరలించారు. కేవలం 10 గంటల సమయంలోనే ఈ కేసును పోలీసులు చేధించినట్లు తెలిపారు. ఈ కేసులో నవీన్ రెడ్డి అనే కిడ్నాపర్ తో పాటు మరో 8 మందిని అరెస్ట్ చేశారు. అయితే మరికొందర్ని కూడా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగినట్లు పోలీసులు వెల్లడించారు.

వైశాలిని కాపాడి సురక్షితంగా ఇంటికి చేర్చిన పోలీసులకు యువతి కుటుంబీకులు ధన్యవాదాలు తెలిపారు. వైశాలిని కిడ్నాప్ చేశాక ఆమెపై దాడి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్ యువతిని మానసికంగా ఇబ్బంది పెట్టాడని, ఆమెను భయపెట్టడంతో కిడ్నాప్ ఘటన నుంచి ఆమె ఇంకా కోలుకోలేదని పోలీసులు తెలిపారు.

రాగన్నగూడకు చెందిన వైశాలికి శుక్రవారం పెళ్లి చూపులు జరిగాయి. ఆ సమయంలో నవీన్ రెడ్డి అనే యువకుడు వంద మందితో వైశాలి ఇంటికి వచ్చి ఆమెను కిడ్నాప్ చేశాడు. అడ్డు వచ్చిన వారిని కొట్టిమరీ వైశాలిని తీసుకెళ్లిపోయాడు. సినిమా లెవల్లో ఈ ఘటన జరిగింది. వైశాలిని నవీన్ రెడ్డి బలవంతంగా లాక్కెళ్లిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

వైశాలి ఇంటిపై 100 మంది యువకులు దాడి చేయడంతో పాటు స్థానికులపై కూడా చేయిచేసుకున్నారు. యువతి ఇంటిని ధ్వంసం చేశారు. స్థానికులు అలర్ట్ అయ్యి పోలీసులకు సమాచారం అందించారు. ఈలోపే వైశాలిని నవీన్ రెడ్డి కిడ్నాప్ చేశాడు. అక్కడున్న అతని మనుషులు కూడా పరార్ అయ్యారు.

గత కొన్ని రోజులుగా నవీన్ రెడ్డి వైశాలిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయం గురించి యువతి తన తల్లిదండ్రులకు చెప్పింది. ఐదారు నెలల నుంచి వైశాలిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆమె ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. మధ్యవర్తుల ద్వారా కూడా వైశాలి తల్లిదండ్రులతో పెళ్లి సంబంధం మాట్లాడించాడు. అయితే వైశాలి తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోలేదు. ఇదంతా మనసులో పెట్టుకున్న నవీన్ రెడ్డి వైశాలిపై కక్ష పెంచుకుని కిడ్నాప్ చేయడానికి సిద్దమయ్యాడు. ప్రస్తుతం నవీన్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Budi Mutyala Naidu: వైసీపీ ఎంపీ అభ్యర్థికి “సన్” స్ట్రోక్.. తండ్రి ఓటమి కోసం కొడుకు ప్రచారం చేస్తున్నారా?

Budi Mutyala Naidu:  రాష్ట్ర ఎన్నికలలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాల ముందు కుటుంబ బంధాలు ఓడిపోతున్నాయి. ఇంతకుముందు టెక్కలి లో ఇలాంటి ఘటన ఒకటి చూసాము, ఇప్పుడు అనకాపల్లి పార్లమెంటు...
- Advertisement -
- Advertisement -