Chiranjeevi-Pawan Kalyan: ఆ విషయంలో చిరు పవన్ మధ్య పోలికే లేదుగా!

Chiranjeevi-Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. మెగా ఫ్యామిలీలో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నా ఒకరితో ఒకరు సంబంధం లేని విలక్షణ స్వభావాలతో తెలుగు ప్రజలకు తెలుసు. పెద్దవాడు మెగాస్టార్ చిరంజీవి శాంతస్వభావి అని, చిన్నవాడు పవన్ కళ్యాణ్ కు దూకుడెక్కువ అని, మధ్యలో ఉన్నవాడికి కోపం ఎక్కువైనా సమయం రాగానే ఎదురుదాడి చేస్తాడని అందరూ అనుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం వీరి గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు షికారు చేస్తున్నాయి.

 

మెగాస్టార్ చిరంజీవి శాంత స్వభావి అని అందరికీ తెలుసు. ఆయన అనవసరంగా నోరు పారేసుకునే టైప్ కాదని, పవన్ అందుకు పూర్తి భిన్నమైనవాడని, శత్రువు ఎంతటివాడైనా ఎదురెళ్లే స్వభావం ఉన్నవాడని నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇకపోతే నాగబాబు ఈ మధ్యకాలంలో తన రాజకీయ ప్రత్యర్థులపై ఎదురుదాడికి దిగుతూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు. అన్నయ్యను కానీ తమ్ముడిని కానీ ఎవరైనా ఏదైనా అంటే మాత్రం వారి తాట తీసేవరకూ నాగబాబు వదలడం లేదు. ఇదే ప్రశ్నను వాల్తేరు వీరయ్య సినిమా ఈవెంట్ లో కూడా ఓ యాంకర్ అడిగింది.

 

చిరు అందుకు సమాధానం ఇస్తూ.. పవన్ రాజకీయాల్లో చాలా ఘాటుగా మాట్లాడతాడని, నాగబాబు కూడా పెరోషియస్ గా ఉంటాడని తెలిపారు. కాలానుగుణంగా సందర్భానుసారంగా అందరూ ఎవరి తీరుతో వారు ప్రవర్తిస్తుంటారని తెలిపారు. పవన్ కానీ నాగబాబు కానీ తమకు ఎదురైన పరిస్థితులను బట్టి స్పందిస్తున్నా సమయస్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నారని చిరు తన తమ్ముళ్లను సమర్థించుకున్నారు.

 

అనవసరంగా ఇతరులపై నాలుక విసిరేసే వ్యక్తి నాగబాబు కాదని, తన తమ్ముడి గురించి తనకు చాలా కాలంగా తెలుసని, అవతలి వైపు నుండి విమర్శలు అన్యాయమని అర్ధంలేనివిగా అనిపిస్తే నాగబాబు మౌనంగా ఉండడని చిరు తెలిపారు. తన తమ్ముళ్లు ఇద్దరూ విమర్శలను గట్టిగా తిప్పి కొడతారని, వారికి ఏం కష్టం రాకుండా చూసే బాధ్యత తనకు ఉందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -