Photo: ఫోటో సూపర్ గా ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలు ఇవే!

Photo: టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ ని వినియోగిస్తున్నారు. ప్రతి ఇంట్లో కనీసం రెండు మూడు స్మార్ట్ ఫోన్లు అయినా కనిపిస్తున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా రెండు విషయాలపై శ్రద్ధ వహిస్తున్నారు. ఒకటి బ్యాటరీ రెండు కెమెరా ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ శాతం మంది కొనుగోలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా యువత చాలామంది ఫోటోల కోసం కెమెరా క్లారిటీ ఎక్కువ వచ్చిన మొబైల్స్ వైపే ఆసక్తిని కనపడుతున్నారు.

అలా సరదాగా ఫ్రెండ్స్ తో వెళ్లిన ఫ్యామిలీతో వెళ్ళినా మంచిగా రెడీ అయినా ఏది చేసినా కూడా ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఫొటోస్ దిగడానికి సందర్భంతో పనిలేదని అంటూ ఉంటారు. చాలామంది ఈ ఫొటోస్ క్లీన్ గా రాలేదని స్మార్ట్ ఫోన్ ని మార్చాలని అనుకుంటున్నారు. ఫొటోస్ అందంగా అద్భుతంగా రావాలంటే ఏం చేయాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వారికోసం చక్కటి శుభవార్త. మరి ఫొటోస్ సరిగా రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొట్టమొదటిది కెమెరా లెన్స్ క్లీన్ గా ఉండాలి.. ఫోటో బాగా రావాలి అంటే కెమెరా లెన్స్ క్లీన్ గా ఉండడం తప్పనిసరి. ఫోటోగ్రఫీకి నేచురల్ లైట్​ చాలా బెటర్​. అందుకే ఫొటోలు తీసేటప్పుడు నేచురల్​ లైట్ ఎక్కడ పడుతుందో అక్కడ ఫొటోలు దిగాలి. గ్రిడ్ లైన్స్ వాడటం వల్ల ఫొటో కరెక్ట్​గా వస్తుంది.

 

అందుకోసం కెమెరా సెట్టింగ్స్​లో గ్రిడ్ లైన్స్ ఫీచర్ ఆన్​ చేయాలి. ఫొటో తీయాలనుకున్న ఆబ్జెక్ట్​తో పాటు చుట్టూ ఉన్న ఎలిమెంట్స్ కూడా కనపడే విధంగా తీయాలి. యాంగిల్స్ మారుస్తూ ఎక్స్​పరిమెంట్స్ చేయవచ్చు. ఫొటోలు తీసేటప్పుడు రకరకాల యాంగిల్స్ ట్రై చేయవచ్చు. క్లాసిక్ ఫొటోగ్రఫీ టెక్నిక్​ వాడి అడ్డంగా, నిలువుగా ఎలా అయినా ఫోటోస్ తీయవచ్చు. అందుకు ఫొటో తీయాలనుకున్న సబ్జెక్ట్​ పొజిషన్​ని ఫోకస్ చేయాలి. ఫొటో బాగా కనిపించాలంటే దగ్గరగా తీయాలి. అందుకు జూమ్ ఫీచర్ కూడా ఉపయోగించవచ్చు. కాకపోతే అది వాడితే ఇమేజ్​ క్వాలిటీ సరిగా రాదు. ఫ్లాష్​ ఎప్పుడు ఉపయోగించకూడదు. చాలా వరకు ఫొటోస్ తీసేటప్పుడు ఫ్లాష్​ వాడకపోవడం మంచిది. ఫ్లాష్ వాడితే ఫొటోలు బాగా రావు. వాటిలో లైటింగ్ సరిగా ఉండదు. దానికి బదులు నేచురల్ లైట్ లేదా వేరే ఏదైనా లైట్ వాడితే ఫొటోస్ బాగా అద్భుతంగా వస్తాయి. తీసిన ఫొటోలు ఇంకాస్త బెటర్​గా కనిపించాలంటే ఎడిటింగ్ చేయాలి. బ్రైట్​నెస్, కాంట్రాస్ట్, శాచ్యురేషన్ వంటివి మార్చవచ్చు. ఫొటోలు బాగా తీయాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎక్స్​పరిమెంట్స్ చేయాలి. డిఫరెంట్ టెక్నిక్స్ వాడి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -