Balakrishna: అభిమానులంటే బాలయ్యకు ఎంత ప్రేమో.. ఇలాంటి హీరోలు ఇంకా ఉన్నారా?

Balakrishna: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో నందమూరి బాలయ్యకు ఉండే క్రేజే వేరు. ఒకానొక సందర్భంలో కెరీర్ డ్రాపౌట్‌లో కొనసాగిన ఆ తర్వాత విడుదలైన సినిమాలతో స్టార్ హీరోగా మరోసారి నిలదొక్కుకున్నారు. యువ హీరోలకు ధీటుగా పోటీ పడుతూ తనదైన శైలిలో ప్రత్యేక అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. సినిమాలతోపాటు టాక్‌ షోలో కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బాలయ్య సినిమాల్లో ఎలా కనిపిస్తారో.. నిజ జీవితంలోనూ అలాగే ఉంటారు. తనని నమ్ముకున్న అభిమానులకు వెన్నంటే ఉంటారు. తాజాగా అలాంటి పనే బాలయ్య చేశారు.

బాలయ్య తన అభిమాని ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకకు హాజరయ్యాడు. అనంతపురం జిల్లా బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిగా గౌస్ మొహిద్దీన్ వ్యవహరిస్తుంటారు. తాజాగా గౌస్ మొహిద్దీన్ కుమార్తె వివాహం జరిగింది. ఈ వేడుకకు బాలయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు హాజరైన బాలయ్య సంప్రదాయ ముస్లిం వేషధారణలో అభిమానులను అలరించారు. ముస్లింల సంప్రదాయ టోపీ ధరించి పెళ్లి కూతురికి గంధం పూశారు. అనంతరం పుష్పగుచ్ఛం అందజేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. బాలయ్య రాకతో పెళ్లింట సందడి వాతావరణం నెలకొంది.

సాధారణంగా కొందరు స్టార్ హీరోలు పెళ్లి వేడుకలకు హాజరైనప్పుడు ఏదో ఉన్నామా? వెళ్లిపోయామా? అనే తీరులో వ్యవహరిస్తుంటారు. కానీ బాలయ్య ఈ పెళ్లి వేడుకలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తన అభిమానులతో కలిసి బాలయ్య ఎంతో అల్లరి చేశారు. దీంతో బాలయ్య వ్యవహరించిన తీరుని చూసి అందరూ ఫిదా అయ్యారు. పెళ్లి వేడుకలో అభిమానులతో కలిసి సెల్ఫీలు కూడా దిగారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. తమ అభిమాన హీరోని కలిసే అవకాశం పొందిన ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలారు. అయితే ఇంట్లో వ్యక్తిగా బాలయ్య అందరిని కలిసి పలకరించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -