Jagan Sarkar: గ్రామ, వార్డ్ వాలంటీర్లకు జగన్ సర్కార్ శుభవార్త ఇదే!

Jagan Sarkar: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. విద్యార్థులకు,మహిళలకు, రైతులకు, ఆటో డ్రైవర్లకు ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్నవారికి ఆర్థికంగా కొన్ని పథకాలను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా తాను మొదలుపెట్టిన ప్రభుత్వ పథకాలు, సేవలు ప్రజలకు అందడంలో ఎలాంటి నిర్లక్ష్యం, ఆలస్యం జరగకూడదనే ఉద్దేశంతో రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెన్షన్‌ మొదలు మండల ఆఫీస్‌కు వెళ్లి చేయాల్సిన పనులు అన్ని వాలంటీర్ల ద్వారా సులభంగా జరుగుతున్నాయి.

అయితే ప్రజలకు ఇన్ని సేవలు చేస్తున్న వాలంటీర్లకు జగన్ సర్కార్‌ శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తూ నిస్వార్థంగా పనిచేస్తున్న వాలంటీర్లను ప్రభుత్వం సత్కరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను ప్రభుత్వం సత్కరించనుంది. ఈ నెల 19న విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిచేతుల మీదుగా ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం అవుతుంది. దాదాపు నెలరోజుల పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కొనసాగనుంది. స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వాలంటీర్లను సత్కరించడం మాత్రమే కాకుండా నగదు బహుమతి కూడా అందజేయనున్నారు. వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ ప్రతి ఏటా వాలంటీర్లకు వందనం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వారిని సత్కరిస్తోంది.

 

2020–2021 తొలిసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండోసారి 2021 ఏప్రిల్‌ 14న ఆ తర్వాత 2022 ఏప్రిల్‌ 7 నుంచి నెల రోజులపాటు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. వాలంటీర్ల పనితీరుపై ప్రజల అభిప్రాయాలు, సంతృప్తిని పరిగణలోకి తీసుకుని ఉత్తమ సేవలు అందించిన వారికి సత్కారం చేస్తున్నారు. అలాగే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వాలంటీర్ల హాజరుతో పాటూ ప్రతినెలా మొదటి రోజునే వంద శాతం లబ్దిదారులకు పింఛన్ల పంపిణీ.. క్లస్టర్ల పరిధిలో లబ్ధిదారుల గుర్తింపు, వివరాల నమోదు వంటి అంశాలలో పనితీరు ఆధారంగా వాలంటీర్లను అంచనా వేస్తారు. ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులకు ఎంపిక చేస్తారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఉత్తమ సేవలు అందించిన ఐదుగురు వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డును ప్రదానం చేస్తారు. ఈ అవార్డును అందుకునే వారికి రూ.30వేల నగదు బహుమతి, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికేట్‌తో సత్కరిస్తారు.

 

అలానే ప్రతి మండలం, మున్సిపాలిటీకి ఐదుగురు చొప్పున.. అదే నగర కార్పొరేషన్‌కు 10 మంది చొప్పున వాలంటీర్లకు సేవారత్న అవార్డును అందజేయనున్నారు. ఈ అవార్డు అందుకునే వారికి రూ.20 వేల నగదు బహుమతి, మెడల్, బ్యాడ్జి, శాలువా, సర్టిఫికేట్లతో సత్కరిస్తారు. అలాగే ఏడాది పాటు సర్వీస్ పూర్తి చేసుకుని ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పనిచేసే మిగిలిన గ్రామ, వార్డు వాలంటీర్లకు సేవామిత్ర అవార్డు అందజేస్తారు. ఈ అవార్డుతో పాటు రూ.10 వేల నగదు బహుమతిని అందిస్తారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -