Nandamuri Family vs Mega Family: మెగా ఫ్యామిలీకి ప్లాఫ్ లు.. నందమూరి ఫ్యామిలీకి సూపర్ హిట్లు?

Nandamuri Family vs Mega Family: తెలుగు ఇండస్ట్రీలో ఎంతో పేరున్న రెండు పెద్ద ఫ్యామిలీలు ఏవి అని ఎవరిని అడిగినా.. మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ అని అందరూ చెబుతారు. నందమూరి తారకరామారావు సినిమాల్లోకి వచ్చి మరుపురాని ఎన్నో సినిమాలు, పాత్రలతో తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయారు. సొంత కష్టం మీద సినీ ఇండస్ట్రీలోకి వచ్చి.. మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవికి సంబంధించిన ఫ్యామిలీ మెగా ఫ్యామిలి.

ఈ రెండు ఫ్యామిలీలకు సంబంధించిన ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ వార్ నడుస్తుంటుంది. నిజానికి ఈ రెండు ఫ్యామిలీలకు చెందిన చిరంజీవి, బాలకృష్ణలు మంచి మిత్రులు. వీరి ఫ్యాన్స్ మాత్రం ఏదోక విషయం మీద ఎప్పుడూ రచ్చ చేస్తూనే ఉంటారు. తాజాగా ఫ్యాన్స్ మధ్య మెగా ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఇంట్రస్టింగ్ విషయం చర్చలోకి వచ్చింది.

మెగా ఫ్యామిలీకి ప్లాఫ్ లు ఇచ్చిన డైరెక్టర్లు.. నందమూరి హీరోలతో మరీ ముఖ్యంగా నందమూరి బాలయ్య బాబుకి మాత్రం భారీ హిట్ ఇస్తారనే చర్చ మొదలైంది. మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోల విషయంలో ఇద్దరు డైరెక్టర్లు విఫలం కాగా.. నందమూరి బాలయ్యతో మాత్రం ఒక హీరో సక్సెస్ అయ్యాడని, మరో డైరెక్టర్ కూడా హిట్ కొడతాడనే టాక్ నడుస్తోంది.

చిరంజీవి కొడుకు రాంచరణ్ తో బోయపాటి చేసిన ‘వినయ విధేయ రామ’ సినిమా ప్లాఫ్ కాగా.. అదే బోయపాటి, బాలయ్యతో చేసిన ‘అఖండ’ బ్రహ్మాండమైన హిట్ అయింది. అలాగే డైరెక్టర్ కొరటాల శివ, చిరంజీవితో చేసిన ‘ఆచార్య’ ప్లాఫ్ అయింది. ఇప్పుడు ఈ డైరెక్టర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తుండగా, బాలయ్యతో కూడా సినిమా చేస్తారనే టాక్ నడుస్తోంది. దీంతో కొరటాల నందమూరి ఫ్యామిలీకి హిట్ ఖచ్చితంగా ఇస్తారనే చర్చ ఫ్యాన్స్ మధ్య నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -