Kodali Nani: కొడాలి నానికి ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఆహ్వానం అందడం వెనుక అసలు కథ ఇదేనా?

Kodali Nani: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన రాజకీయ విమర్శలతో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. ఆయన హరికృష్ణ కి అత్యంత ఆప్తుడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఒకప్పుడు ఆత్మ మిత్రుడు. జూనియర్ ఎన్టీఆర్ అతనిని అన్నలాగా భావించేవాడు. స్కూల్ కి సెలవులు ఇచ్చినప్పుడు తాను గుడివాడలోని నాని అన్న ఇంటికి వెళ్లే వాడిని చాలాసార్లు ఎన్టీఆర్ చెప్పడం గమనార్హం.

ఆ తర్వాత కొడాలి నాని తెలుగుదేశం పార్టీని వదిలి వైసీపీలో చేరటంతో నాని ఎన్టీఆర్ ల మధ్య పెద్దగా సత్సంబంధాలు ఉన్నట్లు కనిపించలేదు. అలాగే తెలుగుదేశం వర్గం వారు కూడా నందమూరి కుటుంబానికి, నానికి పెద్దగా సత్సంబంధాలు లేవని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా బయటపడిన ఒక ఫోటో తెలుగుదేశం వర్గం వారిలో అలజడి ని రేపుతుంది. అదేంటంటే ఈ మధ్యకాలంలో నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని కుమారుడు పెళ్లి జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ పెళ్లిలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో పాటు నందమూరి కుటుంబ సభ్యులందరూ హాజరై సందడి చేశారు. అయితే అదే పెళ్లిలో కొడాలి నాని కూడా పాల్గొని దంపతులని ఆశీర్వదించాడు. సుహాసిని దంపతులే దగ్గరుండి కొడాలి నానితో అక్షింతలు వేయిస్తున్నట్లుగా ఉంది ఆ ఫోటో. అయితే చంద్రబాబునాయుడు కి బద్ద శత్రువైన కొడాలి నాని అలా సుహాసిని ఇంట్లో ప్రత్యక్షమవడంతో షాక్ కి గురయ్యారు తెలుగుదేశం వర్గం వారు.

అయితే ఈ పిక్ చూసిన నెటిజెన్స్ నాని కి ఎన్టీఆర్ కి మధ్య సత్సంబంధాలే కొనసాగుతున్నాయని అనుమానిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు కూడా ముడిపెడుతున్నారు. ఎన్టీఆర్ బలవంతం మీదే సుహాసిని కొడాలి నానిని పెళ్లికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఏమాత్రం స్పందించని తారక్ పై ఈ విషయాన్ని కూడా ముడిపెట్టి మరింత ఫైర్ అవుతున్నారు తెదేపా వర్గం వారు. మరి దీనిపై అయినా ఎన్టీఆర్ స్పందిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Budi Mutyala Naidu: వైసీపీ ఎంపీ అభ్యర్థికి “సన్” స్ట్రోక్.. తండ్రి ఓటమి కోసం కొడుకు ప్రచారం చేస్తున్నారా?

Budi Mutyala Naidu:  రాష్ట్ర ఎన్నికలలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాల ముందు కుటుంబ బంధాలు ఓడిపోతున్నాయి. ఇంతకుముందు టెక్కలి లో ఇలాంటి ఘటన ఒకటి చూసాము, ఇప్పుడు అనకాపల్లి పార్లమెంటు...
- Advertisement -
- Advertisement -