Tortoise Vastu Tips: తాబేలు విగ్రహం ఆ దిక్కున ఉంచితే అదృష్టం మారిపోతుందట!

Tortoise Vastu Tips: హిందూ సాం‍ప్రదాయాల్లో శాస్త్రలు, వాస్తులు ఎక్కువగా నమ్ముతారు. వాటిని పాటిస్తారు కూడా గృహ నిర్మాణం, పెళ్లి చేయాలన్నా.. జ్యోతిష్యులు, శాస్త్రలు చెప్పిన విధంగానే పాటిస్తుంటారు. పెద్ద పెద్ద షాపింగ్‌ మాళ్లు, భారీ దుకాణాల కౌంటర్ల వద్ద రాగి గిన్నె, లేదా గాజు పాత్రలో నీటిలో ఓ తాబేలు విగ్రహాన్ని కచ్చితంగా ఉంటారు. తాబేలు ప్రతిమని ఇత్తడిలో కానీ..క్రిష్టల్, ఇత్తడి ప్లేట్ లో గాని, పింగాణి లేదా గాజు పాత్రలోగాని నీటిని పోసి తాబేల్ ని ప్లేట్ తో సహా ఉత్తరం దిక్కున ఉంచాలి.ప్రతిరోజు ఉదయాన్నే ప్లేట్లో ఉన్న నీటిని తీసివేసి కొత్త నీటిని పోసి ఉత్తరం దిక్కున ఉంచాలి.

ప్లేట్ లో నీటిని పోసేటప్పుడు మన మనస్సులో ఉన్న కోరికలను మనస్సులో తలచుకుంటూ నీటిని పోయాలి. తాబేలు నీటిలో ఉంటే ఎక్కువ రోజులు బతుకుతుంది. కాబట్టి తాబేలుని నీటిలో ఉంచటంతో తాబేలుకి సహజ వాతావరణంలో ఉంచామనే అనుభూతి కలుగుతుంది. బతికి ఉన్న తాబేలుని కూడా ఎక్వేరియంలో ఉంచి ఉత్తరం దిక్కున ఉండవచ్చు. తాబేలు ని విష్ణు భగవానుడి స్వరూపంగా కొలుస్తారు.వాస్తు శాస్త్రం రీత్యా ఉత్తరం దిక్కు బుధుడికి చెందిన దిక్కు అని,ఉత్తరం కుబేర స్థానంగా భావిస్తారు.

తాబేలుని నీటిలో ఉంచి ఉత్తరం దిక్కున ఉంచటం వలన బుధగ్రహా దోషాలు తొలిగిపోతాయి. తాబేలు ఉన్న ఇంటి లో పిల్లలు అందరు మంచి విద్యతో విద్యావంతులుగా ఎదుగుతారు. మంచి వాక్శుద్ది తో భావప్రకటన చేయగల సామర్ధ్యం కలిగి ఉంటారు. తాబేలు ఉన్న ఇంటిలో వాస్తు దోషాలు ఉంటే కొంత వరకు దోష నివారణ జరుగుతోంది. ఆ ఇంట్లోని వారందరికీ మానసిక ప్రశాంతత కలుగుతోంది. తాబేలు ఉన్న ఇంట్లో ధనానికి ఎలాంటి లోటపు ఉండదట. తాబేలును దుకాణాల్లో ఉంచడంతో వ్యాపారాభివృద్ధి చెందుతోందని భావించి దాన్ని కచ్చితంగా ఉంచుకుంటారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -