Transgenders: హిజ్రాలపై కామాంధుల దాడి.. నిందితులను పట్టిస్తే వదిలేశారంటూ రోడ్డుపై బైఠాయించిన హిజ్రాలు!

Transgenders: ప్రస్తుత సమాజంలో ఆడవాళ్ళకే కాకుండా హిజ్రాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా కామాంధుల ప్రవర్తనలో మార్పు మాత్రం శూన్యం. తాజాగా యానంలో కొంతమంది కామాంధులు హిజ్రాలపై తీవ్రంగా దాడి చేసి.. చంపుతాం అంటూ బెదరించడంతో ఆ యువకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని హిజ్రాలు శనివారం కోరంగి పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు.

నిందితులను పట్టిస్తే శిక్షించకుండా వదిలేస్తారా అంటూ సుమారు 100 మంది హిజ్రాలు జాతీయ రహదారి 216లో పోలీస్ స్టేషన్ ఎదుట బయట ఇచ్చారు. సుమారు అరగంటసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీస్ స్టేషన్ లోకి ఎవరిని వెళ్లకుండా అడ్డుగా కూర్చోవడం ద్వారా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని తేల్చడంతో అదనపు బలగాలను రప్పించారు.

ఎస్సై.టి. శివకుమార్ తమపై దాడి చేసిన యువకులపై కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో హిజ్రాలు శాంతించారు. ఇంతలో అక్కడికి చేరుకున్న మీడియాతో బాధిత హిజ్రాలు ఐశ్వర్య, లిథియా మాట్లాడుతూ పొట్టకూటి కోసం యానంలో సంచరిస్తున్నామని తమపై పది మంది యువకులు మూడు నెలలుగా మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని తెలిపారు.

ఆపరేషన్ చేయించుకున్న ఒకామెపై ముగ్గురు యువకులు లైంగిక దాడికి ప్రయత్నించగా అడ్డుకున్నందుకు కత్తులతో, కర్రలతో దాడి చేసి తమ వద్ద ఉన్న సెల్ ఫోన్లు, మనీ పర్సులు లాక్కోని వెళ్లారని తెలిపారు. హిజ్రాలపై దాడి చేసిన నిందితులు కొల్లు మరిడయ్య, ఆకుల సాయి ప్రసాద్, మొగలి నానిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Judges Trolling Case: జడ్జి హిమబిందుని అవమానించేలా పోస్టు పెట్టిన ‍వ్యక్తి అరెస్ట్‌.. ఆ వ్యక్తి ఎవరంటే?

Judges Trolling Case: చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే. నంద్యాలలో సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడుని అదుపులోకి...
- Advertisement -
- Advertisement -