Bigg Boss 6 Telugu: మొదటి కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీకదీపం హిమ!

Bigg Boss 6 Telugu: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడేప్పుడా అని ఎదురుచూస్తున్నటువంటి బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఆటపాటల నడుమ నాగార్జున ఒక్కో కంటెస్టెంట్ ను హౌస్ లోకి పంపిస్తున్నారు.ఈ క్రమంలోనే హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరా అని ప్రేక్షకులు సైతం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.అయితే మొదటి కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంతో ఘనంగా ఎంట్రీ ఇచ్చారు కార్తీకదీపం హిమ.

కార్తీకదీపం సీరియల్ లో హిమ పాత్రలో నటిస్తున్నటువంటి కీర్తి భట్ మొదటి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. బుల్లితెర నటిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కీర్తి భట్ మొదటి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అనంతరం చైల్డ్ ఆర్టిస్ట్ పింకీ, అనంతరం సిరియల్ ప్రియుడు శ్రీహన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు.అయితే సోషల్ మీడియాలో బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనే కంటెస్టెంట్ ల పేర్లు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే ఎక్కడ కూడా కీర్తి భట్ పేరు వినపడలేదు.

ఈ విధంగా మొదటి కంటెస్టెంట్ గా ఈమె వేదిక పైకి రావడంతో అభిమానులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొత్తానికి ఈమె బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వేదికపై ఈమె తన తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో మరణించిన విషయాన్ని గుర్తు చేసుకొని బాధపడ్డారు. ఇకపోతే తనకు ఒక కూతురు ఉందని విషయాన్ని ఈ సందర్భంగా బయటపెట్టారు. తన కుటుంబం మొత్తం యాక్సిడెంట్ లో మరణించడంతో తన బంధువులందరూ తన ఆస్తి లాక్కొని తనని రోడ్డుపైకి లాగారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని ప్రస్తుతం పలు సీరియల్స్ లో నటిస్తున్నానని తెలిపారు. అదేవిధంగా తన కుటుంబ సభ్యులకు కోల్పోవడంతో ఈమె ఒక పాపను దత్తత తీసుకొని పెంచుకుంటున్నారని ఈ వేదికపై కీర్తి భట్ తన వ్యక్తిగత విషయం గురించి వెల్లడించారు. సీరియల్స్ లో నటించి అందరిని మెప్పించిన బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -