Nagarjuna: నాగార్జున హోస్టింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్!

Nagarjuna: దేశంలో నెంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో అన్ని భాషలలో ప్రసారమవుతూ మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. తెలుగులో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో టెలివిజన్లో ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకోగా … ఓటీటీలో ఒక నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. ఇక ఇటీవల బిగ్ బాస్ సీజన్ సిక్స్ కూడా ప్రారంభం అయ్యింది. ఈ సీజన్ సిక్స్ లో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు.

బిగ్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన వారిలో గీతు రాయల్ కూడా ఒకరు.యూట్యూబ్ వీడియోస్, బిగ్ బాస్ రివ్యూలు ఇస్తూ ఎంతో ఫేమస్ అయిన గీతూ రాయల్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తనదైన శైలిలో ఆట ఆడుతూ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలుస్తూ టైటిల్ దక్కించుకోవడానికి గట్టి పోటీ ఇస్తుంది. ఇదిలా ఉండగా గతంలో బిగ్ బాస్ షో గురించి రివ్యూలు ఇచ్చి గీత రాయల్ నాగార్జున గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది.

బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా రెండవ సీజన్లో హీరో నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఇక బిగ్ బాస్ మూడవ సీజన్ నుండి వరుసగా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అయితే గీతు రాయల్ కి మాత్రం నాగర్జున హోస్ట్ గా వేస్ట్ అని అందరికన్నా నాని బెస్ట్ అని సంచలన వ్యాఖ్యలు చేసింది.

కంటెస్టెంట్లు తప్పు చేస్తే నాగార్జున అలా కాదమ్మా.. ఇలా కాదమ్మా … చాలా సాఫ్ట్ గా ఉంటాడు. నాగార్జున అలా చేయడం కరెక్ట్ కాదు. బిగ్ బాస్ అంటేనే రోస్ట్. అది లేకపోతే వేస్ట్” అని షాకింగ్ కామెంట్స్ చేసింది.మరి గీతు చేసినటువంటి ఈ కామెంట్స్ పై నాగార్జున ఎలా స్పందిస్తారు. ఆమె వ్యాఖ్యలను ఎలా స్వీకరిస్తారనే విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా గీతు రాయల్ ఈ మధ్యకాలంలో ఎవరిని వదలకుండా అందరి పై తన స్టైల్ లో సెటైర్లు వేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -