Wasim Akram: ఒక్కోరు 8 కేజీల మ‌ట‌న్.. పాకిస్తాన్ క్రికెటర్ల తిండి కష్టాలు మామూలుగా లేవుగా!

Wasim Akram:  పాకిస్తాన్ జట్టు ఇండియాతో ఓడిపోవడం అనేది ఎప్పుడూ అలవాటే కానీ ఇప్పుడు ఆఫ్గనిస్తాన్తో ఓడిపోవడంతో తీవ్ర విమర్శల పాలవుతుంది. పాకిస్తాన్ ప్రస్తుత టీం ని సొంత దేశం వాళ్లే విమర్శిస్తున్నారంటే వాళ్ళు ఎంత ఘోరంగా ఓడిపోయారో అర్థం చేసుకోవాల్సిందే. చెన్నై చపాక్ లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ను చిత్తు చేసింది ఆఫ్గనిస్తాన్. 8 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.

పాకిస్తాన్ పెట్టిన 282 పరుగుల టార్గెట్ ను రెండు అంటే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఆఫ్ఘనిస్తాన్ విజయాన్ని చేజిక్కించుకుంది. ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ లో ఇబ్రహీం దర్గాహ్ 87, రహమతుల్లా దుర్బాజ్ 65 పరుగులతో తొలి వికెట్ నష్టానికి 130 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పుడే మ్యాచ్ వారి వశం అయిపోయింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు రహమత్ షా 77, కెప్టెన్ హస్మతుల్లా షాహిది 48 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచారు.

ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్ చవిచూచిన మూడో ఓటమి ఇది. వరుసగా ఆడిన మూడు మ్యాచ్ల్లోని పాకిస్తాన్ ఓడిపోవడంతో తీవ్ర విమర్శలపాలయ్యింది. అయితే పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్లు సైతం ప్రస్తుత టీం కి చివాట్లు పెడుతున్నారు. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఈ ఓటమి పట్ల ఎలా స్పందించాలో కూడా తెలియటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కూడా 282 పరుగుల కోసం బ్యాటర్లు కష్టపడాల్సి వచ్చింది అంటే అది వారి వైఫల్యమేనని అన్నారు.

స్కోర్ ని కాపాడుకోవడంలో కూడా ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ఆఫ్ఘనిస్తాన్ ని కట్టడి చేయడంలో చేతులెత్తేసారని మండిపడ్డారు. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలు అత్యంత నాసిరకంగా ఉన్నాయి. వారి ఫిట్నెస్ లెవెల్స్ చూస్తూ ఉంటే రోజుకి 7, 8 కిలోల మటన్ తింటున్నట్లుగా కనిపిస్తోందని చెప్పారు. అలాగే సరైన దిశలో బౌలర్లు బంతులను సందించలేకపోయారని, పక్కా ప్లానింగ్ లేకపోవడం కూడా మ్యాచ్ ఓడిపోవడానికి కారణం అని చెప్పుకొచ్చారు ఈ మాజీ కెప్టెన్.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -