Upendra: దళిత వర్గాల గురించి చెత్తవాగుడు వాగిన ఉపేంద్ర.. కొంచెమైనా తెలివి లేదా అనేలా?

Upendra: పేరు, ఫేము ఉంది కదా అని కొందరు సినిమా హీరోలు నోటికి వచ్చినట్లు మాట్లాడి అనవసరంగా తమ ఇమేజ్ పాడు చేసుకుంటున్నారు. ఇంతకుముందు చాలా మంది అలాగే నోటికి వచ్చింది మాట్లాడి నెటిజన్స్ ట్రోలింగ్ కి గురైన సంగతి మనకి తెలిసిందే. ఇప్పుడు అదే కోవలోకి కన్నడ నటుడు ఉపేంద్ర చేరారు. ఏదో ఉద్దేశంతో దళితుల గురించి మాట్లాడితే అది మరి ఎక్కడికో దారితీసి ఆఖరికి ఆయన మీద కేసులు పెట్టేవరకు వెళ్లింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఈ మధ్యకాలంలో ఆయన ఫేస్ బుక్ లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.

ఇందులో తన రాజకీయ పార్టీ ప్రజాకియా గురించి మాట్లాడుతూ.. అమాయక హృదయం ఉన్నవారు మాత్రమే మార్పు కోరుకుంటారు కానీ కొందరు ఉంటారు మనసులో ఏది అనుకుంటే అది వ్యాఖ్యానిస్తారు. అలాంటి వారిని మనం ఏమి చేయలేము. ఒక ఊరు ఉంటే అందులో దళితులు కూడా ఉంటారు కదా ఈ వ్యక్తులు కూడా అంతే అంటూ ఆయన చెప్పుకొచ్చారు. తన పార్టీని విమర్శించే వారిని ఇలా ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు కాకపోతే ఆ వ్యాఖ్యలు ఎస్సీ సంఘాల మనోభావాలను దెబ్బతీశాయి.

 

దాంతో కర్ణాటక రామనగర అట్టుడికి పోయింది పెద్ద ఎత్తున దళిత సంఘాలు ఆందోళనలను నిర్వహించాయి. ఉపేంద్ర మీద నిరసన తెలియజేస్తూ అతని పోస్టర్లను కూడా తగలబెట్టారు ఎస్సీ వర్గం వారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అప్పటికి గాని ఉపేంద్ర కి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు వెంటనే తన స్పందన తెలియజేస్తూ ఆ వీడియోని డిలీట్ చేసి మరొక వీడియో పోస్ట్ చేశారు.

 

ఆ వీడియోలో అనుకోకుండా అవి వ్యాఖ్యలు చేశాను. దయచేసి నన్ను క్షమించండి అని కోరుతూ ప్రకటన చేశారు మీ మనోభావాలు దెబ్బతిన్నాయని తెలుసుకొని వెంటనే వీడియో డిలీట్ చేశాను తప్పుగా అనుకోవద్దు అంటూ క్షమాపణలు చెప్పుకొచ్చాడు స్టార్ నటుడు ఉపేంద్ర. అందుకే అంటారు నోరు అదుపులో ఉంటే ఊరు అదుపులో ఉంటుంది అని.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -