Vaishnav Tej: తప్పుకోకపోతే వైష్ణవ్ తేజ్ కెరీర్ కు భారీ నష్టమా.. ఏం జరిగిందంటే?

Vaishnav Tej: మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నటువంటి వారిలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఒకరు. ఉప్పెన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి ఈ హీరోకి అనంతరం రెండు సినిమాలు వరుసగా డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఈయన తదుపరిచిత్రం ఆదికేశవ సినిమా విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

శ్రీ లీల వైష్ణవ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం ఆది కేశవ ముందుగా ఈ సినిమాని ఆగస్టు 18వ తేదీ విడుదల చేయడానికి మేకర్స్ నిర్ణయించుకున్నారు అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఆగస్టు 10వ తేదీ రజనీకాంత్ జైలర్ సినిమా విడుదల కాబోతోంది 11వ తేదీ మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఇలాంటి తరుణంలో వైష్ణవ్ ఆదికేశవ సినిమాని విడుదల చేయడం సరైనది కాదు.

 

అనుష్క నవీన్ పోలీస్ శెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా కూడా ఆగస్టు 18న విడుదలకు సిద్ధమవుతుంది. అలాగే వరుణ్ తేజ్ గాండీవ దారి అర్జున సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కాబోతుంది ఇలా వరుసగా సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఆదికేశవ సినిమా విడుదల కాకుండా ఈ విడుదల నుంచి తప్పుకోవడమే మంచిదని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తుంది.

 

ఇక ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించడంతో సినిమాపై అంచనాలే ఉన్నాయి. అయితే హీరోయిన్ నటించడం మాత్రమే సినిమాకి ప్లస్ పాయింట్ కాదు పబ్లిసిటీ కూడా ఎంతో ముఖ్యం ఇలా ఈ సినిమాని ఆగస్టు 18వ తేదీ విడుదల కనుక చేస్తే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చేయలేదు. అందుకే ఈ సినిమాని తప్పనిసరి పరిస్థితిలో వాయిదా పడింది అలా కాకుండా ఈ సినిమా కూడా అన్ని సినిమాలతో పోటీగా విడుదలయితే ఈయనకు మరో ఫ్లాప్ కాయమేనంటూ పలువురు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -