Viral Video: సెక్యూరిటీ గార్డుతో ముగ్గురు యువతులు చేసిన పనికి చీ కొడుతున్నారు!

Viral Video: ఒకప్పుడు పలనా అమ్మాయిని వేధిస్తున్నారు.. లేదో ఆ అమ్మాయిపై దాడి చేశారు అనే వార్తలు వినేవాళ్లం.. కానీ.. ప్రస్తుతం యువతులే ఏకంగా మగవారిని మూకుమ్మడిగా దాడులకు దిగుతున్నారంటే వారి ప్రవర్తన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో కొంతమంది ఆడపిల్లలు బరితెగిస్తున్నారు. పురుషులతో సమానంగా తాగుతున్నారు. వయస్సు భేదం లేకుండా ప్రవర్తించడం, ఎవరైనా ఇది తప్పని చెబితే ఎదురు తిరగడం మామూలైంది. చదువు, పార్టీల పేరు చెప్పి ఇష్టానుసారంగా అర్ధరాత్రి వరకు తిరిగి తమ తల్లిదండ్రులను తల దించుకునేలా చేస్తున్నారు. ఆడ పిల్లలం ఏమైన చేయొచ్చు.. మాదే నెగ్గుతుందనే అపోహలో దాడులకు సైతం దిగుతున్నారు. కొన్ని నెలల క్రితం ఓ కారు డ్రైవర్‌ సైడ్‌ ఇవ్వలేదని నడి రోడ్డుపై ఆపి ఓ అమ్మాయి ఎగిరెగిరి చెప్పలు వాయించిన వీడియో చాలా వైరల్‌ అయింది. అలాంటి ఘటన యూపీ నోయిడాలో చోటు చేసుకుంది. అర్ధరాత్రి అప్పతాగి వచ్చిన ముగ్గురు యువతులు  సెక్యూరిటీ గార్డుపై ఇష్టానుసారంగా దాడిచేసి గాయపర్చారు.


అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  యూపీ నోయిడాలో అంజారా‡ హోమ్స్‌లో పంకాజ్‌ సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అర్ధరాత్రి కారులో ముగ్గురు యువతులు వచ్చి గేటు తెరవాలని కోరగా కారుకు స్టిక్కర్‌ లేకపోవడంతో పంకాజ్‌ వారిని లోపలికి వెళ్లనివ్వలేదు. అప్పటికే ముగ్గురు యువతులు మద్యం మత్తులో ఉన్నారు. పంకాజ్‌ ఆ యువతుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత కోపోద్రిక్తులైన యువతులు ఒక్కసారిగా పంజాక్‌పై పిడిగుద్దులతో దాడికి తెగబడ్డారు.

పక్కన ఉన్న వారు ఆపేందుకు యత్నించిన ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా దుర్భాషలాడుతూ కొడుతూనే ఉన్నారు.  కాసేపటి తర్వాత బాధితుడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి చేరుకునే   లోపు ముగ్గురిలో ఓ యువతి అక్కడి నుంచి పారిపోగా ఇద్దరిని పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. శ్వాస పరీక్ష నిర్వహించగా అధిక మోతాదులో మద్యం తాగినట్లు నిర్ధారించారు. ఈ వార్త నెట్టింట్లో వైరల్‌ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.  కొందరు యువతుల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తోందని కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan , YS Sharmila: పసుపు రంగును జగన్ సహించలేకపోతున్నారా.. నీచమైన కామెంట్ల వెనుక కారణాలివేనా?

CM Jagan , YS Sharmila: వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి అంటే ఆయన మాట తీరు ఆయన వ్యవహార శైలి ఎలా...
- Advertisement -
- Advertisement -